/rtv/media/media_files/2026/03/20/key-decision-of-the-department-of-transport-in-telanagna-2026-03-20-06-58-36.jpg)
key decision of the department of transport in telanagna
సాధారణంగా చాలమంది వాహనాదారులు రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తుంటారు. చలాన్లు కూడా సకాలంలో చెల్లించరు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రవాణా శాఖ ఓ కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకనుంచి చలాన్లు సకాలంలో చెల్లించని వారి డ్రైవింగ్ లైసైన్స్, వెహికిల్ ఆర్సీ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రక్రియను త్వరలోనే అమలుచేయనున్నారు. ట్రాఫిక్ చలాన్లపై వస్తున్న ఫిర్యాదులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: మా డాడీ, మోడీ, చిన్న మోడీ.. ఉగాది వేళ కవిత ఊహించని కామెంట్స్!
కేంద్ర మోటార్ వాహన రూల్స్ ప్రకారం చలాన్లపై అభ్యంతరాలు పరిష్కరిండం కోసం గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఒకట్రెండు రోజుల్లో జారీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త రూల్‌లో చలాన్లపై వాహనాదారులు ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ అభ్యంతరాలు నమోదు చేయాలి. దీనిపై అధికారులు పరిశీలించాక నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయాన్ని వాహన యజమానికి లేదా డ్రైవింగ్ లైసెన్స్ హోల్టర్‌కు SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. అంతేకాదు ఈ ప్రక్రియన పారదర్శకంగా నిర్వహించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను కూడా తీసుకొచ్చారు.
Follow Us