BIG BREAKING: కేటీఆర్ పై మరో కేసు
బంజారాహిల్స్ పీఎస్ లో మాజీ మంత్రి KTR పై కేసు నమోదైంది. ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులపై దుర్భాషలాడడం, న్యూసెన్స్, ట్రాఫిక్ సమస్యకు కారణయ్యారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్ పీఎస్ లో మాజీ మంత్రి KTR పై కేసు నమోదైంది. ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులపై దుర్భాషలాడడం, న్యూసెన్స్, ట్రాఫిక్ సమస్యకు కారణయ్యారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు.
దుబాయ్‌లో ఉద్యోగాలున్నాయని తీసుకెళ్లి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 80 మందిని మోసం చేశాడు గల్ఫ్ ఏజెంట్. దుబాయ్ బ్యాంకుల్లో వారిపేర్లమీద లోన్లు తీసి ఇంటికి పంపించాడు. బ్యాంకునుంచి EMI కట్టాలంటూ ఫోన్లు రావడంతో ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు.
ఏసీబీ విచారణలో కేటీఆర్ తో పాటు లాయర్ ను అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. లాయర్ దూరం నుంచి కేటీఆర్ ను చూడొచ్చని తెలిపింది. సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది.
క్వాష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ తరఫున ఆయన లీగల్ టీం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో బస్ ఛార్జీలు పెంచే అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. బీసీ మంత్రుల పట్ల కేబినెట్లో వివక్ష ఉందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. బండి సంజయ్ తో తనకు విభేదాలు లేవన్నారు. RTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు. ఎవరూ ప్రేక్షక పాత్ర పోషించొద్దని, ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని కేసులుపెట్టినా భయపడొద్దని చెప్పారు. ప్రజలు తమవైపే ఉన్నారని, మళ్లీ దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ సంచలన కామెంట్స్ చేశారు. TSను TGగా మార్చేందుకు వెయ్యికోట్లు ఖర్చు చేస్తారా? అనే కేటీఆర్ కామెంట్స్‌కు చామల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'గుంటూరు చదువులో లెక్కలు చెప్పలేదా? లేక లెక్కల్లో మీరు వీకా?' అంటూ సెటైర్స్ వేశారు.
హైదరాబాద్, ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జేబీఎస్ టూ శామీర్‌పేట్, ప్యారడైజ్ టూ మేడ్చల్ రెండు మెట్రో కారిడార్లకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3నెలల్లో డీపీఆర్ సిద్ధం చేయాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు.