SLBC: మంత్రుల చేపల కూర విందు.. కేటీఆర్ సంచలన ట్వీట్!
విషాదంలో మంత్రుల వినోదం అంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెలికాప్టర్ యాత్రలు .. చేపకూర విందుల్లో మంత్రులు మునిగిపోయారంటూ ఓ ఫొటోను తన X ఖాతాలో షేర్ చేశారు.
విషాదంలో మంత్రుల వినోదం అంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెలికాప్టర్ యాత్రలు .. చేపకూర విందుల్లో మంత్రులు మునిగిపోయారంటూ ఓ ఫొటోను తన X ఖాతాలో షేర్ చేశారు.
ఎమ్మెల్సీ పోలింగ్ విధుల నిర్వహించిన సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు కరీంనగర్లో రోడ్డు ప్రమాదానికి గురైంది. కరీంనగర్, జగిత్యాల హైవేపై గంగాధర రైల్వే గేటు వద్ద అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్‌ను ఢీ కొట్టింది. దీంతో 20 మంది సిబ్బందికి గాయాలైయ్యాయి.
క్రికెట్ మ్యాచ్ లాంటి MLC ఎలక్షన్స్ ఫిబ్రవరి 27న జరుగబోతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇండియా టీం బీజీపీ, ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీం అని ఆయన విమర్శించారు. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ అన్నారు.
బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ జిల్లాలో రైతుల వద్దకు వెళితే బీఆర్ఎస్ లుచ్చాలు తమను చంపాలని చూశారని చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? సీఎం రేవంత్ కు పౌరుషం చచ్చిపోయిందా అని ప్రశ్నించారు.
తెలంగాణ మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 25 నుంచి 27 వరకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 25న సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు షాపులు మూసి ఉంటాయి.
ఆస్తులు, డబ్బు, అంతస్తుల నీడన అత్మీయతలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. అన్న, చెల్లె, తమ్ముడు, అక్క అనే బంధాలు కానరానివవుతున్నాయి. దీంతో మనిషనేవాడు మాయమై, మానవత్వం మంటగలిసి ఆస్తి కోసం అన్నాచెల్లెల్లు, అన్నదమ్ములు ఒకరినొకరు కొట్టుకుని చంపుకుంటున్నారు.
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏమిటో చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేస్తుందని, మరీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తారా అని ప్రశ్నించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని చెప్పారు.
భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓల్డ్ అల్వాల్‌లో జరిగింది. శిరీష(28)కు 2019లో సరూర్ నగర్‌కు చెందిన పవన్తోమొదటి పెళ్లయింది. భర్త చనిపోవడంతో మరోవ్యక్తితో పెళ్లి చేయగా అతడు వేధింపులకు గురిచేయడంతో శిరీష ఆత్మహత్యకు పాల్పడింది.