BIG BREAKING: కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా ?

జగిత్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా తన అనుచరులతో చెప్పారు. మార్చి 25న ఆయన బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

New Update
Jeevan Reddy

Jeevan Reddy

జగిత్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా తన అనుచరులతో చెప్పారు. మార్చి 25న ఆయన బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. గత 40 ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన సంజయ్‌.. కాంగ్రెస్‌లో చేరడాన్ని జీవన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో అప్పటినుంచి ఆయన పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 

Also Read: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎస్కేప్ అయిన ఆ కీలక నేతలు ఎవరు?

40 ఏళ్లుగా పార్టీలో ఉన్నాకూడా తనకు ప్రాధాన్యం లేదని ఆయన భావిస్తున్నారు. జీవన్‌రెడ్డి మద్దతుదారులు కూడా ఈ విషయం పట్ల తీవ్ర అంసతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. జగిత్యాలలో భారీ సభను ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. 

Also Read: హైదరాబాద్ లో అనుకోని వర్షం...ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన

Advertisment
తాజా కథనాలు