Telangana: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అది బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోతుందని భావించినప్పటికీ యూటర్న్ తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. రేపటికి అది ఏపీ, తమిళనాడు వైపు వచ్చేలా కనపడుతుందని అధికారులు ప్రకటించారు. Also Read: Donald Trump: మస్క్ అధ్యక్షుడవుతారా..?గట్టిగానే సమాధానమిచ్చిన ట్రంప్ దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈనెల 26 వరకు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. 0900 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (शाम) 1730 बजे IST पर जारी किया गया/7-day forecast(EVENING) of TELANGANA based on 0900 UTC issued at 1730 hours IST Dated :22/12/2024@CEO_Telangana @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC pic.twitter.com/5zgKPS6UM9 — Meteorological Centre, Hyderabad (@metcentrehyd) December 22, 2024 Also Read: BIG BREAKING: పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం! తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. అప్పటి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు అన్నారు. అయితే ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పారు. ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా కురుస్తుందని అధికారులు తెలిపారు. ఉపరిత గాలులు గంటకు 4-8 కి.మీ వేగంతో వీస్తాయన్నారు. Also Read: BREAKING: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ట్వీట్! అదే సమయంలో తెలంగాణలో నేటి నుంచి కాస్త చలి గాలులు పెరిగే అవకాశాలున్నాయన్నారు. వారం క్రితం తెలంగాణలో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోగా.. మూడు, నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు కొంచెంపెరిగాయి. అల్పపీడన గాలల కారణంగా మేఘాలు ఆవరించటంతో చలి తీవ్రత కొంచెంతగ్గింది. అయితే నేటి నుంచి మళ్లీ తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుందన్నారు. Also Read: Brazil Plane Crash: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం..10 మంది మృతి!