Fire Accident In Hyderabad: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షేక్‌పేటలోని జుహి ఫెర్టిలిటీ సెంటర్‌లో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఘటన స్థలంలో పాత సామాగ్రి ఉండడంతో మంటలు మరింత ఎగిసిపడి పై ఫ్లోర్ వరకు అంటుకున్నాయి. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇతర స్టోర్లకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న డీమార్ట్,(D-Mart) ట్రెండ్స్ రిలయన్స్ (Trends Reliance) స్టోర్లకు కూడా మంటలు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు మాదాపూర్, లంగర్‌హౌస్, పంజాగుట్ట నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్లు తెప్పించారు. ఈ ప్రమాదంలో బిల్డింగ్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులను ఫైర్ సిబ్బంది కాపాడారు.
ఇది కూడా చదవండి: తిరుపతిలో ఘోర ప్రమాదం..భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్ ఇద్దరు భక్తులు మృతి
హైదరాబాద్ షేక్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జుహి ఫెర్టిలిటీ సెంటర్‌లో చెలరేగిన మంటలు చుట్టుపక్కల అంతా వ్యాపించాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న డీమార్ట్, ట్రెండ్స్ రిలయన్స్‌కు..
— RTV (@RTVnewsnetwork) January 17, 2025
Read more >>https://t.co/yhSyBFVK16#Hyderabad #DMart #RTV
ఇటీవలే ఏపీలో..
ఇది ఇలా ఉంటే ఇటీవలే ఏపీలోని బాపట్లలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా పర్చూరు తూర్పు బజార్‌లో షార్ట్‌సర్క్యూట్ కావడంతో ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు దగ్ధం కాగా.. ఇద్దరు మహిళలు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులను నాగమణి, మాధవీలతగా గుర్తించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Also Read: Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!