Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ లైన్‌కు స్వస్తి!

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై స్మార్ట్ కార్డ్ రిచార్జ్ కోసం టికెట్ కౌంటర్‌లో క్యూ కట్టకుండానే సులభంగా యూపీఐ ద్వారా రీచార్జ్ చేసుకేలా యాప్ తీసుకురానుంది. కార్డు చూపకుండానే ఎంట్రీ, ఎగ్జిట్‌ అయ్యే ఆప్షను ఈ యాప్‌లో ఉండనుంది.

author-image
By srinivas
New Update
hyderabad metro

హైదరాబాద్ మెట్రో స్మార్ట్ కార్డు

Metro: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిరోజు టికెట్, స్మార్ట్ కార్డు రిచార్జ్ కోసం క్యూలైన్‌లో నిలబడేందుకు ఇబ్బంది పడుతున్న కస్టమర్లకోసం సరికొత్త ప్లాన్ తీసుకురానుంది. ఈ మేరకు స్మార్ట్ కార్డులో 10 పర్సెంట్ డిస్కౌంట్‌ రిచార్జ్ కోసం టికెట్ కౌంటర్ వద్ద క్యూ లైన్‌లో నిలబడే అవసరం లేకుండా మెట్రో స్మార్ట్ కార్డు వినియోగించుకునే సదుపాయం కల్పించనున్నారు. ఏకంగా కార్డును పర్సులో నుంచి బటయకు తీయకుండానే ఎంట్రీ, ఎగ్జిట్ కావొచ్చు. 

ఢిల్లీ మెట్రో తరహాలో యాప్..

ఈ మేరకు స్మార్ట్ కార్డు కోసం థర్డ్ పార్టీ యాప్ తీసుకురానున్నట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది. యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాలని, దీనిద్వారా చిక్కులు వీడనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో డీఎంఆర్‌సీ అనే యాప్ ప్రవేశపెట్టగా.. ఇందులో ఎప్పటికప్పుడు ఏదైనా యూపీఐ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకొని డైరెక్ట్‌గా వాడుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే మెట్రో కార్డు ఎంట్రెన్స్ టాప్ చేస్తున్నామో.. అలాగే ఈ యాప్ ఓపెన్ చేసి అక్కడున్న కెమెరాకు టాప్ చేస్తే సరిపోతుంది. మీ అకౌంట్లో నుంచి జర్నీకి సంబంధించిన డబ్బులు కట్ అయిపోతుంది. ఈ యాప్ వాడిన అదే డిస్కౌంట్‌ను మెట్రో ప్రయాణికులకు ఇచ్చేస్తుంది. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని మెట్రో కార్డును క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చూపియడంతో పాటు మీ ట్రిప్ వివరాలు కూడా చూపిస్తుంది. ఏ టైం కి ఎక్కడ చెకింగ్ అయ్యారు, ఏ స్టేషన్లో ఎప్పుడు దిగారు అనే పూర్తి వివరాలను యాప్‌లో చూసుకోవచ్చు. రీఛార్జ్ కూడా విత్ ఇన్ సెకండ్స్‌లో చేసుకునే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: అక్రమ సంబంధాల్లో మహిళలే టాప్.. ఇండియాలో ఆ రాష్ట్రమే నెం.1

ప్రస్తుతానికి ఢిల్లీలో యాప్ ద్వారా లక్షల మంది ప్రయాణికులు హ్యాపీ జర్నీ చేస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్ మెట్రోలో కూడా ఇలాంటి మొబైల్ అప్లికేషన్ రానుంది. ఇప్పటికే దీన్ని మెట్రో అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025 జనవరిలో యాప్ అమ్మల్లోకి తెచ్చేందుకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు