హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. సిటీ మొత్తం అలర్ట్

హైదరాబాద్‌లో బీదర్ దొంగల ముఠా కాల్పులు కలకలం రేపాయి. బీదర్‌లో ఓ ఏటీఎం వ్యాన్ కొల్లగొట్టిన దొంగల ముఠా డబ్బులతో పారిపోయి హైదరాబాద్ వచ్చింది. వారిని పట్టుకోవడానికి వచ్చిన బీదర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగల ముఠా మూడు రౌండ్ల కాల్పులు జరిపింది.

author-image
By K Mohan
New Update
firing in hyd

firing in hyd Photograph: (firing in hyd)

నగరం నడిబొడ్డున హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‎లో గురువారం కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఓ బస్ క్లీనర్ గాయపడ్డాడు. బీదర్‌లో ఓ ఏటీఎం వ్యాన్ కొల్లగొట్టిన దొంగల ముఠా డబ్బులతో పారిపోయి హైదరాబాద్ వచ్చింది. వారిని పట్టుకోవడానికి వచ్చిన బీదర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగల ముఠా మూడు రౌండ్ల కాల్పులు జరిపింది.

ఇది కూడా చదవండి: BIG BREAKING: టీడీపీలోకి మంచు మనోజ్!

అఫ్జల్‌గంజ్‎లోని ఓ ట్రావెల్స్ ఆఫీసులోకి సినిమా రేంజ్‌లో దొంగలు పోలీసులపై కాల్పులు జరిపారు.ఈక్రమంలో బస్సు క్లీనర్ కు బుల్లెట్ తాకింది. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన సిటీ పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. 

ఇది కూడా చదవండి: Mumbai: సైఫ్ కేసులోకి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ఎంట్రీ.. వణికిపోతున్న ముంబై మాఫియా!

కర్ణాటకలోని బీదర్‌లో ఓ ఏటీఎం క్యాష్ వ్యాన్‌పై దొంగల ముఠా కాల్పులు జరిపారు. ఈ కాలుల్లో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. డబ్బులతో పరారైన దొంగల ముఠా హైదరాబాద్‎కు వచ్చారు. సమాచారం అందుకున్న బీదర్ పోలీసులు నిందితులను వెంబడిస్తూ  హైదరాబాద్‎కు వచ్చారు. అఫ్జల్‌గంజ్‏లో తలదాచుకున్న దొంగలు బీదర్ పోలీసులను చూసి వారిపై కాల్పులు జరిపారు. 

ఇది కూడా చదవండి: Ananya nagalla: సంక్రాంతికి అరిసెలు చేసిన అనన్య నాగళ్ల.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు