HYD Crime
HYD Crime: ఈ మధ్య కాలంలో యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోతున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అయితే.. బైక్‌లు, కార్లలో వెళ్తున్న యువకులు అతి వేగంతో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాని పోలీసులు తెలుపుతున్నారు. అందుకే ఎక్కువ మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలు వేగంగా ఉండడంతో వాటిని కంట్రోల్ చేయలేక ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా నార్సింగ్ పరిధిలో స్పీడ్‌తో ఇద్దరు విద్యార్థులు బలయ్యారు. ఈ విషాదం ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: గుండెపోటుకు 30 రోజుల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి
అతి వేగంతో..
హైదరాబాద్ నార్సింగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగ్ మూవీ టవర్ దగ్గర స్తంభాన్ని కారు ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. స్పాట్‌లోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులంత MGIT కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. అతివేగమే ప్రమాదానికి పోలీసులు కారణమంటున్నారు. గండిపేట నుంచి కాలేజ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నిప్పింది.
ఇది కూడా చదవండి: ప్రైవేట్ భాగంలో దురద రాకుండా ఉండటానికి ఇలా చేయండి
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులంతా వివేక్ రెడ్డి, సృజన్, కార్తికేయ, హీమ్ సాయి, శ్రీకర్, హర్షవర్ధన్‌గా గుర్తించారు. గండిపేట్ కళాశాల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి ముఖ్య కారణమని పోలీసులు నిర్ధారించారు. క్షతగాత్రులను చికిత్స కోసం మృతులను పోర్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందటంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నారు.
ఇది కూడా చదవండి: రోజంతా నిద్రపోతున్నారా.. ఈ సమస్యకు కారణం ఇదే