ఈ మధ్య కాలంలో సైబర్ కేటుగాళ్ల ఆగడాలు పెరిగిపోయాయి. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్దులు, సంపన్నులనే టార్గెట్ చేస్తున్నారు. బెదిరించి భయపెట్టి డబ్బులు గుంజేస్తున్నారు. అప్పటికీ వినకపోతే డిజిటల్ అరెస్ట్ అంటూ వణికిస్తున్నారు. కేసు ఫైల్ చేసి జైల్లో వేస్తామంటూ బెదిరిస్తున్నారు. అలా డబ్బులు కొట్టేయడమే కాకుండా.. వీడియో కాల్ ద్వారా బట్టలు విప్పమని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కొందరు స్కామర్లు. Also Read: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ డాక్టర్‌కి రూ.11.11 కోట్లు టోకరా తాజాగా అలాంటి సైబర్ స్కామ్ మరొకటి హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన 50 ఏళ్ల డాక్టర్ నుంచి రూ.11.11 కోట్లు కాజేశారు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ డబ్బును 34 విడతలుగా దోచేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! ఆగస్టులో మిత్తల్ అనే వ్యక్తి బాధితుడి (డాక్టర్) వాట్సప్‌కు ఫారెక్స్ ట్రేడింగ్ అనే ఒక లింక్ పంపించాడు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు పొందొచ్చని నమ్మించాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించొచ్చని మాయ చేశాడు. ఇక ఇదంతా నిజమేనని నమ్మిన ఆ వైద్యుడు.. కేటుగాళ్లు పంపించిన లింక్ ఓపెన్ చేసి అందులో తన పేరుతో పాటు ఇతర వివరాలను నమోదు చేసుకున్నాడు. అయితే ఆ కేటుగాడు అయిన మిత్తల్ మొదటి నుంచి తన ప్లాన్ ప్రకారమే మాయ చేస్తూ వచ్చాడు. మొదటగా ఫారెక్స్ ట్రేడింగ్ కోసం భారతీయ కరెన్సీని యూఎస్‌డీటీ అనే క్రిప్టో కరెన్సీలోకి మార్చాల్సి ఉంటుందని డాక్టర్‌కి చెప్పాడు. అనంతరం కేటుగాడు తనతో పాటు తన కుమార్తె సాక్షిగా చెప్పి ఓ యువతి అకౌంట్‌కు డబ్బులు పంపించాలని చెప్పాడు. దీంతో ఆ బాధితుడు ఆర్‌టీజీఎస్ ద్వారా ఆ అకౌంట్‌కు డబ్బులు పంపించాడు. Also Read: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ డబ్బులు పంపించిన అనంతరం ఆన్‌లైన్‌లో "ట్రేడింగ్ ఖాతా"లో పెట్టుబడి పెట్టిన దానికి అధిక లాభాలు కనిపించాయి. పెట్టిన పెట్టుబడికి ఊహించలేనంత డబ్బు లాభం రూపంలో వచ్చినట్లు ట్రేడింగ్ ఖాతా ఆన్‌లైన్లో కనిపించింది. దాన్ని విత్ డ్రా చేసేందుకు ఆ డాక్టర్ ప్రయత్నించగా.. రూ.3.7 కోట్ల టాక్స్ చెల్లించాలని మోసగాళ్లు చెప్పారు. Also Read: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే! అయితే తన వద్ద అంత లేదని కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో.. మిగతా రూ.1.7 కోట్లు రుణంగా ఇస్తామని కేటుగాడు మిత్తల్ చెప్పాడు. దీంతో అతడి వద్ద ఉన్న రూ.2 కోట్లను ఆ వైద్యుడు కేటుగాళ్లు సూచించిన అకౌంట్లకు ట్రాన్సఫర్ చేశాడు. ఆపై మరోసారి తనకు వచ్చిన లాభాలను విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ చట్టాల ప్రకారం.. ముందస్తు పన్ను చెల్లించాలని వారు సూచించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత వైద్యుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.