Garikipati అలాంటోడా...  సంచలన ఆరోపణలు చేసిన మొదటి భార్య

గరికపాటి నరసింహారావుపై ఆయన మొదటి భార్య కామేశ్వరి సంచలన వాఖ్యలు చేశారు. ఆడది అంటే చాలా ఆయనకు అలుసని.. గరికపాటి పెట్టే హింసలు బయటకి చెప్పేవి కాదన్నారు. తనపై  క్రిమినల్ కేసు పెడతావా అంటూ గరికపాటిపై కామేశ్వరి ఫైర్ అయ్యారు.

New Update
garikapati

garikapati Photograph: (garikapati)

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) పై ఆయన మొదటి భార్య కామేశ్వరి సంచలన వాఖ్యలు చేశారు. గరికపాటి ఓ నీచుడు, ఆయన పేరు తలుచుకున్నే పాపమేనంటూ ఆమె  తీవ్రస్థాయిలో మండిపడ్దారు.  25 ఏళ్ల తనను రాక్షసుడిలా ఏడిపించాడంటూ కామేశ్వరి ఆరోపణలు చేశారు.  గరికపాటికి నీతి లేదని.. ఖ్యాతి కోసం పాకులాడుతాడని మండిపడ్డారు.  ఆడది అంటే గరికపాటికి చాలా అలుసంటూ చెప్పుకొచ్చారు కామేశ్వరి. తన పిల్లల కోసమే గరికపాటి పాతిక సంవత్సరాలు భరించానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

Also Read :  75 ఏళ్ల నాటి చట్టం తెర మీదకి...కానీ అడ్డుపడుతున్న బైడెన్‌!

పచ్చటి సంసారాన్ని కూల్చాడు

గరికపాటి తనకంటే రెండేళ్లు చిన్నవాడని.. తన పచ్చటి సంసారాన్ని కూల్చి తనను రెండో పెళ్లి చేసుకున్నాడంటూ తెలిపారు.  వాలి,సుగ్రీవుడి కథ చెప్పినందుకు తనపై  క్రిమినల్ కేసు పెడతావా అంటూ గరికపాటిపై కామేశ్వరి ఫైర్ అయ్యారు.   తన మీద,  తన కొడుకుతోనే క్రిమినల్ కేసు పెట్టించి  పోలీస్ స్టేషన్‌కు లాగుతారా అని మండిపడ్దారు.  గరికపాటి పెట్టె హింసలు బయటకి చెప్పేవి కాదని తెలిపారు కామేశ్వరి.  గరికపాటి రెండో భార్య శారదా చాలా మంచిదని చెప్పుకొచ్చారు.  కాగా కామేశ్వరితో విడిపోయి శారదను రెండో పెళ్లి చేసుకున్న గరికపాటి.. పిల్లల బాధ్యతను ఆయనే తీసుకున్నారు.

Also Read :  స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్.. మే తర్వాతే ఎలక్షన్స్?

స్పందించిన గరికపాటి టీమ్

అయితే కామేశ్వరి చేసిన కామెంట్స్ పై  గరికపాటి టీమ్ స్పందించింది.   కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారం ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులను కలత పెడుతోందని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.  గరికపాటిపై  కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.   ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్‌, పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు.  అంతేకాకుండా ఇకపై అలాంటి దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  

Also Read :  GATE Admit Cards 2025: గేట్ అడ్మిట్ కార్డ్ విడుదల

Also Read:  తెలంగాణలో కల్లు, మటన్ ఉంటే చాలు.. Dil Raju వివాదాస్పద వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు