సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 8 సినిమాలకు తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నారు. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం అని తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నాం ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్ స్వాప్ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు! ఐటీ, ఫార్మాతో పాటు తమకు సినిమా పరిశ్రమ కూడా చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం అని.. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్‌డిసి ఛైర్మన్‌గా నియమించామన్నారు. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. వెనక్కి తగ్గేదే లేదు ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు? సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలన్నారు. మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రకు టాలీవుడ్ సహకరించాలి అని పేర్కొన్నారు. అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీదే అని స్పష్టం చేశారు. ఇకపై బెన్ ఫిట్ షోలు, టిక్కెట్ల రేట్ల పెంపు ఉండదని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. ఇండస్ట్రీకి ఒక కమిటీ అలాగే సినీ పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి అని పేర్కొన్నారు. తెలంగాణలో షూటింగ్‌లకు అద్భుతమైన లోకేషన్లు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఒక్క రాత్రిలో ఎలాంటి లొకేషన్లకైనా వెళ్లొచ్చని.. ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్‌కు రెండు గంటల్లో రావొచ్చన్నారు. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండన్నారు. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందని.. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అని తెలిపారు. ALSO READ: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ లైన్‌కు స్వస్తి! నెక్స్ట్ లెవెల్‌కు ఇండస్ట్రీ హైదరాబాద్‌లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పరిశ్రమను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలన్నారు. సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని గుర్తు చేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఎల్లప్పుడు అండగా ఉంటాం ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్ స్వాప్ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు! సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనదన్నారు. తనకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని.. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. బౌన్సర్ల విషయంలో ఇకపై సీరియస్‌గా ఉంటామన్నారు.