హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు ఆంధోళనకు దిగారు. మాజీ మంత్రి హరీశ్ రావును గచ్చిబౌలి పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హరీశ్ రావు అరెస్ట్ ను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హరీష్‌రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తతు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ లీడర్ హరీష్‌రావు అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణుల ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డిలను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి హరీశ్ రావును విడుదల చేశారు. హరీశ్ అరెస్ట్ ను ఖండిస్తూ గచ్చిబౌలి పీఎస్ కు కవిత కూడా అక్కడికి వెళ్లారు.