ఆహా మస్తు ఆకాలేస్తోంది.. ఇవాళ ఎలాగైనా బిర్యానీ తినాల్సిందే అంటూ కొందరు స్నేహితులు మాట్లాడుకున్నారు. వెంటనే బైకులు తీశారు. సమీపంలో ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ లోపల నుంచి ఘుమఘుమలాడే బిర్యానీ వాసన వారిని మరింత మత్తెక్కించింది. Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ దీంతో వెంటనే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. కొద్ది సేపటి తర్వాత బిర్యానీ వచ్చింది. అప్పటికే ఆకలితో ఉన్న ఆ ఫ్రెండ్స్ ఆగలేకపోయారు. ఒక్కసారిగా తినడం స్టార్ట్ చేశారు. అలా తింటున్న క్రమంలో ఊహించని వస్తువు ఓ యువకుడి నోటికి తగిలింది. ఏంటా అని చూసి వారంతా షాకయ్యారు. వెంటనే రెస్టారెంట్ యాజమాన్యానికి చెప్పగా వారు నిర్లక్ష్యం చూపారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: ఎట్టకేలకు కలుసుకున్న ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే.. వీడియో వైరల్ ఘుమఘుమలాడే బిర్యానీ ఆర్డర్ యాదాద్రి భువనగరి జిల్లా బీబీ నగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య బిర్యానీ తినాలనుకున్నాడు. దీంతో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీ తినేందుకు వెళ్లారు. Also Read: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని! హాస్పిటల్‌లో టీటీ ఆపై చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. వేడి వేడి బిర్యానీ రావడంతో అంతా కలిసి తిన్నారు. అయితే మధ్యలో బ్లేడ్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారుమాత్రం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బాధితుడు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆపై హాస్పిటల్‌లో టీటీ చేయించుకున్నాడు. Also Read: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు