బీజేపీ, బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేతలు

తెలంగాణలో బీజేపీకి, బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. ఈయనతో పాటు బీఆర్‌ఎస్ నేత, కుమురం భీం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరారు.

New Update
BRS BJP

తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. ఈయనతో పాటు బీఆర్‌ఎస్ నేత, కుమురం భీం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. గురువారం వీళ్లిద్దరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే శనివారం తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. 

Also Read: కన్న తల్లిదండ్రులను, అక్కను కత్తితో పొడిచి పొడిచి.. ఎంత క్రూరంగా చంపాడంటే?

ఈ నేపథ్యంలో బీజేపీ నేత సోయం బాపురావు పార్టీ మారడం చర్చనీయాంశమవుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సోయం బాపురావు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్‌ ఇవ్వాలని హైకమాండ్‌ను కోరినప్పటికీ అవకాశం రాలేదు. దీంతో అప్పటినుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ కాంగ్రెస్‌ కండువాను కప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.  

మరోవైపు ఆత్రం సక్కుకు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌  టికెట్ ఇవ్వలేదు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎంపీ టికెట్ ఇచ్చి ఆదిలాబాద్‌ నుంచి బరిలోకి దింపింది. కానీ ఎన్నికల ఫలితాల్లో ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో ఈయన కూడా బీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ప్రచారం నడిచింది. దీంతో ఈయన కూడా మళ్లీ కాంగ్రెస్‌ గూటికే చేరారు.  ఇదిలాఉండగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

Also Read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్‌ కంపెనీ..

మరోవైపు కాంగ్రెస్‌ కూడా తమ పార్టీలో చేరికలు ఉంటాయని చెబుతోంది. తాజాగా బీజేపీ నేత సోయం బాపురావు, బీఆర్ఎస్ నేత ఆత్రం సక్కు కాంగ్రెస్ కండువ కప్పుకోవడం చర్చనీయాంశమవుతోంది. మరి త్వరలో ఇంకా ఏ నేతలు కాంగ్రెస్‌లో చేరుతారనేది ఆసక్తి నెలకొంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు