సంధ్య థియేటర్ వద్ద అసలేం జరిగింది?.. RTV వద్ద అసలైన వీడియో!

సంధ్య థియేటర్ ఘటనలో అనేక ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ అసలైన వీడియోను సంపాధించింది. అల్లు అర్జున్ ఎప్పుడు వచ్చాడు? రేవతి ఏ సమయంలో చనిపోయింది?.. ఎవరి వద్ద లేని సంచలన వాస్తవాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి..

New Update
Sandya theatre issue

Sandya theatre issue

సంధ్య థియేటర్ వద్ద ఆ రోజు ఏం జరిగింది? అల్లు అర్జున్ థియేటర్ లోకి ఎప్పుడు వెళ్లాడు?... రేవంత్ ఏ సమయంలో చనిపోయింది. అన్ని వివరాలను సమగ్రంగా తెలిపే ఎక్స్ క్లూజీవ్ వీడియో RTV వద్ద ఉంది. అల్లు అర్జున్ థియేటర్ లోకి రాకముందే రేవతి చనిపోయిందన్న ఓ ఫేక్ వీడియో నిన్న సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యింది. దీనిపై పోలీసులు సైతం సీరియస్ అయ్యారు. తప్పుడు వీడియోలను ఇలా సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: YEAR ENDER 2024: ఏపీ నుంచి మహారాష్ట్ర వరకు.. ఈ ఏడాదిలో పొలిటికల్ హైలెట్స్ ఇవే!

ఈ నేపథ్యంలో RTV అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు RTV రంగంలోకి దిగింది. అసలైన వీడియోను సేకరించింది. ఆ వీడియో ప్రకారం.. రాత్రి 8 గంటల 58 నిమిషాలకు అల్లు అర్జున్ థియేటర్లోకి వెళ్తున్నట్లుగా స్పష్టమైంది. తొక్కిసలాట కారణంగా చనిపోయిన రేవతిని రాత్రి 9 గంటల 16 నిమిషాలకు బయటకు తీసుకెళ్తున్నారు. దీంతో అల్లు అర్జున్ థియేర్లోకి వచ్చిన తర్వాతనే తొక్కిసలాట జరిగినట్లుగా స్పష్టం అవుతోంది.  
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ నోట తగ్గేదే లే మాట.. సినీ పెద్దలతో ఏమన్నారంటే?

publive-image
థియేటర్ లోకి అల్లు అర్జున్ వస్తుండగా సీసీ టీవీ ఫుటేజ్ (సమయం రాత్రి-8:58 గంటలు)

 

publive-image
రేవతిని బయటకు తీసుకెళ్తున్న దృశ్యం-సమయం రాత్రి 9:16 గంటలు

ఫేక్ వీడియోలో ఏముంది?

నిన్న సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఫేక్ వీడియోలో రాత్రి 9.16 గంటలకే  రేవతిని బయటికి తీసుకొస్తున్నట్లుగా ఉంది. 9.40 ప్రాంతంలో అల్లు అర్జున్ థియేటర్‌లోకి వచ్చినట్లుగా ఉంది. అయితే.. ఈ వీడియో ఆధారంగా సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు పోలీసులపై ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ రాకముందే ఆమె చనిపోయిందని.. పోలీసులు అబద్ధాలు చెబుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కావాలనే ఈ కేసులో అల్లు అర్జున్ ను ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు RTV బయటపెట్టిన వీడియో ద్వారా ఈ ఫేక్ ప్రచారానికి చెక్ పడింది.

Fake posts on sandya theatre issue
Fake posts on sandya theatre issue

 

నిన్న సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియో..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు