అల్లు అర్జున్‌ FIRలో తప్పుడు రిపోర్ట్‌..కోర్టులో నవ్వుకున్న లాయర్లు

అల్లు అర్జున్‌ కేసులో పోలీసుల నిర్లక్ష్యంతో తొక్కిసలాట ఘటన జరిగింది. లాజిక్స్‌ పాయింట్స్‌తో సినిమా కోర్టు సీన్‌ రిపీట్‌ తరహాలో హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. నిరంజన్‌రెడ్డి వాదనల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
allu arjun1

TG Politics

TG Politics: సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. పోలీసులు అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. 14 రోజుల రిమాండ్‌ విధించడంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి అల్లు అర్జున్‌ తరపున వాదనలు వినిపించారు. లాజిక్స్‌ పాయింట్స్‌, బలమైన వాదనతో బన్నీకి బెయిల్‌ వచ్చేలా చేశారు. 

Also Read: అస్వస్థతకు గురైన బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ

సినిమా కోర్టు సీన్‌ రిపీట్‌:

అయితే ఈ సందర్భంగా హైకోర్టులో న్యాయవాదుల మధ్య నవ్వులు పూశాయి. ఓ రకంగా చెప్పాలంటే పవన్‌ కల్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సినిమా కోర్టు సీన్‌ రిపీట్‌ అయింది. ఆ సీన్‌లో సూపర్‌ ఉమెన్‌ అనే పోలీస్‌ ఆఫీసర్‌ పాపులర్‌ అయింది. అదే తరహాలో ఇప్పుడు నిరంజన్‌రెడ్డి ఆ సీన్‌ గుర్తు చేశారు. కేసులో పోలీసులు రాసిన రిమాండ్ రిపోర్టు గురించి ప్రస్తావించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట ఘటన జరిగిందని చెప్పారు.  సినిమా చూసే సమయంలో అల్లు అర్జున్ బాల్కనీలో ఉన్నారని రాశారు.
Also Read:  మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన


పోలీసులు సైతం బన్నీని చూసేందుకు బాల్కనీకి వెళ్లి ఇక్కడ బందోబస్తును పక్కన పెట్టారని అన్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో తొక్కిసలాట జరిగిందని, మహిళ, చిన్నారి ఏడుపు వినిపించి పోలీసులు వెంటనే గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి వచ్చారని రాశారు. అంటే దీని అర్థం గ్రౌండ్ ఫ్లోర్‌లో తొక్కిసలాట జరగుతున్న సమయంలో అక్కడ పోలీసులు లేరని, వాళ్లు కూడా అల్లు అర్జున్‌ను చూసేందుకు ప్రేక్షకులతో పాటే వెళ్లారని నిరంజన్‌ అన్నారు. దీంతో కోర్టులో నవ్వులు పూశాయి. పోలీసులు బందోబస్తును వదిలేసి అల్లు అర్జున్‌ కోసం పై అంతస్తుకు వెళ్లడంతో ఘటన జరిగింది. జరిగినదాంట్లో అల్లు అర్జున్ తప్పు లేదని, పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. దీంతో న్యాయమూర్తి అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ వాదనల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థులు హత్య.. స్పందించిన విదేశాంగ శాఖ

Also Read: బన్నీకి బెయిల్ ఇచ్చిన లాయర్ ఎవరు? వామ్మో గంటకు ఇంత ఫీజు హా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు