/rtv/media/media_files/2026/03/22/amazon-ai-phone-2026-03-22-11-22-54.jpg)
Amazon AI Phone
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. వాయిస్ అసిస్టెంట్ అలెక్సాతో సహా అభివృద్ధి చేసిన అమెజాన్ సర్వీసెస్‌తో ఈ ఫోన్ లింక్ అయ్యేలా ఉంటుందని తెలుస్తోంది. ఇది సంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌లాగా పనిచేస్తుందని.. అలాగే ఏఐ సేవలు కూడా అందిస్తుందని తెలిపారు. అమెజాన్ యాప్‌పై మరింత ఈజీగా కొనుగోళ్లు చేసేలా, ప్రైమ్‌లో వీడియోలు చూసేలా ఈ ఫోన్‌ను తయారుచేయనున్నారు.
Also Read: హర్మూజ్ జలసంధిలో.. భారత నౌకకు దారి చూపిన ఇరాన్ నేవీ
అలాగే అమెజాన్ మ్యూజిక్‌లో సంగీతం , ఆహార డెలివరీ సేవలు కూడా పొందేలా తీర్చిదిద్దనున్నారు. అయితే ఈ ఏఐ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉండొచ్చు, ఎప్పుడు మార్కెట్‌లోకి రావొచ్చు అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ అనుకున్నట్లు రాకపోతే ఈ ప్రాజెక్టు పక్కన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Also Read: 48 గంటల్లోగా హర్మూజ్ తెరవాలి.. లేకపోతే ?.. ట్రంప్ సంచలన హెచ్చరిక
Follow Us