USA: డెమోక్రటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ ఖరారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధికి కమలా హారిస్‌ను కన్ఫామ్ చేశారు. పార్టీ తరుఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు కావాల్సిన ప్రతినిధుల మద్దతును ఆమె పొందారు .
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధికి కమలా హారిస్‌ను కన్ఫామ్ చేశారు. పార్టీ తరుఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు కావాల్సిన ప్రతినిధుల మద్దతును ఆమె పొందారు .
పెన్సెల్వేనియాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మీద అటాక్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ దాడిలో ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డారు. దానికి కారణం ఒక మహిళ అంట. అందుకే ఆమెకు ట్రంప్ స్టేజ్ మీదకు పిలిచి మరీ కృతజ్ఞతలు చెప్పారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్ పై కాల్పులు జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటన మీద ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ట్రంప్‌ను కూడా ఇంటర్వ్యూ చేయాలని ఎఫ్‌బీఐ భావిస్తోంది.
అమెరికాలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. దీంతో డెమోక్రాటిక్ పార్టీ సడన్‌గా ముందంజలోకి వచ్చేసింది. ట్రంప్ వెనుకబడిపోయారు అని సర్వేలు చెబుతున్నాయి.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతిచ్చారు. హారీస్‌కు ఫోన్ చేసి మద్దతు ఇచ్చినట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. అమెరికాకు హారిస్ మంచి అధ్యక్షురాలు అవ్వగలదని భావిస్తున్నామని.. ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఆయన మీద హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
అధ్యక్ష రేసు నుంచి వైదొలగిన జో బైడెన్.. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌కు మద్దతిచ్చారు. అయితే మాజీ అధ్యక్షుడు ఒబామా మాత్రం ఇంతవరకు హారిస్‌కు మద్దతివ్వలేదు. మరోవైపు ట్రంప్ కూడా.. బైడెన్ కంటే కమలా హరీస్‌ను ఓడించడం చాలా తేలికని ఓ వార్త సంస్థతో అన్నారు.
అమెరికాలో తెనాలికి చెందిన హారిక అనే యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఆగస్టులో పశువైద్య విభాగంలో ఎంఎస్ చేసేందుకు ఆమె అమెరికాకు వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం హారిక స్నేహితులతో కలిసి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అమెరికాలో భారతీయుల మీద దాడుల, కాల్పులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. తాజాగా మరో భారత సంతతి వ్యక్తిపై కాల్పులు జరిగాయి. రోడ్ యాక్సిడెంట్ విషయంలో జరిగిన వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.