USA: మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్..
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి...ట్రంప్ ఒక స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చారు. వైట్ హౌస్ లో తనను కలవడానికి వచ్చిన మోదీకి, ట్రంప్ తానే స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ ను అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి...ట్రంప్ ఒక స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చారు. వైట్ హౌస్ లో తనను కలవడానికి వచ్చిన మోదీకి, ట్రంప్ తానే స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ ను అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అక్రమ వలసల గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ అక్రమ రవాణాను అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని ఆయన అన్నారు.
పలు దేశాలపై విధిస్తున్న సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు పెంచాలా లేదన్న దానిపై ఒకటి , రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించి పుతిన్ అంగీకారానికి వచ్చారని చెప్పారు. త్వరలోనే తాము కలిసి ఫైనల్ డెసిషన్ కు వస్తామని అన్నారు.
బందీల విడుదలను ఆలస్యం చేస్తామని హమాస్ ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. బందీల విడుదలపై హమాస్ కు డెడ్ లైన్ విధించారు. వచ్చే శనివారంలోపు అందరినీ విడుదల చేయకపోతే నరకం చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
అక్రమ వలసదారుల అంశంలో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా వెళ్తోంది.ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌లోకి అక్రమంగా వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న 600 మందికి పైగా వలసదారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్‌కు ఉత్తరాన రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైంది. దీని కారణంగా అమెరికాకు సునామీ ముప్పు ఉందని జియోలాజికల్ సర్వే సంస్థ హెచ్చరించింది.
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అమెరికాలో భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. సియాటెల్‌కు చెందిన యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..తాము ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేస్తామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవస్థ తయారీలో భాగస్వామి అయ్యేందుకు తాము కూడా రెడీగా ఉన్నామని కెనడా మంత్రి బిల్ బ్లేయర్ అన్నారు.