Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు!
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల కోసం 62 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు..వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఈ రైళ్లను నడపనున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల కోసం 62 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు..వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఈ రైళ్లను నడపనున్నారు.
శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల సంఖ్య..శుక్రవారం నుంచి ఒక్కసారిగా పెరిగిపోయింది.దీంతో భారీగా క్యూలైన్లు ఏర్పడ్డాయి.రోజుకు 80 వేల టోకెన్లు జారీచేయనున్నట్టు కేరళ ప్రభుత్వం ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వివరించారు. సన్నిధానం నుంచి పంబ వరకూ అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని 26 రైళ్లను ప్రత్యేకంగా నడపనుంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి, కొట్టాయం, కొచ్చి నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది.
శబరిమల భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కేరళ ప్రభుత్వం స్వామి చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. శబరిమల పూజావిధానం, విమానం, రైళ్లు, పోలీసులు ఇలా అన్ని వివరాలను ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం ఆరు భాషల్లో తెలుసుకునే అవకాశం కల్పించింది.
శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్రావన్‌కోర్ దేవస్థానం తెలిపింది. మరణించిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది.
అయ్యప్ప మాలను విరమింపజేసేందుకు భక్తులు ఇరుముడితో శబరిమల వెళ్తుంటారు. ఇకపై వీరు విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీలో ఇరుముడిలను తీసుకెళ్లవచ్చని, ఈ అవకాశం 2025 జనవరి 20 వరకు మాత్రమే లభిస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపాడు.
ఆన్లైన్లో నమోదు చేసుకోకపోయిన శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేవలం ఆన్లైన్లో నమోదు చేసుకుంటేనే దర్శనం ఉంటుందనే దానిపై ఎక్కువగా విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.