మంత్రి ఉత్తమ్ ఇంట్లో విషాదం!
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. సాయంత్రం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. సాయంత్రం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో సబ్సిడీ ధరలకే గోధుమలు ఇస్తామన్నారు. బియ్యం నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
TG: అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రాధాన్యత ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ సివిల్ సప్లై శాఖలో రూ.1000 కోట్ల లంచాల అవినీతి జరిగిందని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో మంత్రి ఉత్తమ్ పాత్ర ఉందన్నారు. యూ ట్యాక్స్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చేసిన ఆరోపణలకు తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.
TG: ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు మంత్రి ఉత్తమ్. 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.