Accident : ఘోర ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్ ఝడిపానీ రోడ్లోని.. పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్ ఝడిపానీ రోడ్లోని.. పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ నుంచి నాగళూరు కు వెళ్లే దారిలో కారు అతివేగంతో పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద విరుదునగర్-మదురై హైవేపై వేగంగా దూసుకెళ్తున్న కారు బైకును తప్పించబోయి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు, బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు.
దిల్లీ లో ఓ కారు భీభత్సం సృష్టించింది. స్థానిక ఓ దుకాణంలోకి అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదం గత నెల 31న జరగగా ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
అమెరికాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక హనీక మృతి చెందింది. ఆదివారం హానిక పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు కారులో గుడికి బయల్దేరారు. కారు పోర్టులాండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దీంతో హానిక అక్కడికక్కడే మృతి చెందింది.
విశాఖలో మద్యం మత్తులో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తూ రెండు బైకులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఆ యువతి.. చిన్నచిన్న గాయాలతో బయటపడింది.
తెలుగు సింగర్ మంగ్లీకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. దీంట్లో మంగ్లీకి స్వల్పంగా గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి ఓ మహిళ మృతికి కారణమయ్యాడు. ఈ ప్రమాదం ఢిల్లీలో జరిగింది. 15 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకకు చెందిన అలీకి హైదరాబాద్ అమ్మాయితో పెళ్లి కుదరగా.. డేట్ ఫిక్స్ చేసేందుకు వస్తున్న క్రమంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఐదురుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు.