Boxing: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. ఇందులో జైస్మీన్ లాంబోరియా ఛాంపియన్‌గా నిలిచారు. లివర్పుల్లో మహిళల 57 కిలోల విభాగంలో జరిగిన పోటీలో ఆమె స్వర్ణం సాధించారు.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. ఇందులో జైస్మీన్ లాంబోరియా ఛాంపియన్‌గా నిలిచారు. లివర్పుల్లో మహిళల 57 కిలోల విభాగంలో జరిగిన పోటీలో ఆమె స్వర్ణం సాధించారు.
హైదరాబాద్ నగరంలోని షేక్‌పేటలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒకరినొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
అంతర్జాతీయ బాక్సింగ్ వేదికపై భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్దీప్ జాంగ్రా సత్తా చాటాడు. కేమన్ ఐలాండ్స్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (WBF) సూపర్ ఫెదర్ వెయిట్లో ఛాంపియన్‌గా నిలిచాడు. తన విజయం భారత ప్రతిష్ట పెంచిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు.
ఒలింపిక్స్ లో పతకం కచ్చితంగా సాధిస్తుందనుకున్నతెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ ఊహించని రీతిలో మొదటి రౌండ్ లోనే వెనుదిరిగింది.ఈ క్రమంలో ఆమె తన బాధను ఎక్స్ ద్వారా పంచుకుంది. జీవితం మొత్తాన్ని బాక్సింగ్ కే కేటాయించాను. ఈ ఓటమి ఫలితాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందంటూ రాసుకొచ్చింది.
ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇప్పటికి 62 పతకాలు సాధించిన ఇండియా అథ్లెట్లు మరి పతకాలు సాధించే అవకాశం ఉంది. మరోవైపు క్రికెట్లోనూ పురుషుల టీమ్ సెమీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళింది.