Trisha: నటి త్రిష ఇంటికి మరోసారి బాంబు బెదిరింపులు!
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కు మరో సారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. చెన్నై ఆళ్వార్‌పేట్ లోని త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది.
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కు మరో సారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. చెన్నై ఆళ్వార్‌పేట్ లోని త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది.
టాలీవుడ్ నటి త్రిష చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దేవాలయానికి ఓ ఏనుగును బహూకరించారు. అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి వారు ‘గజ’ అనే ఏనుగును దానం చేశారు.
నటి త్రిష తాజాగా సోషల్ మీడియాలో షేర్ పోస్ట్ వైరల్ గా మారింది. ఎవరో మల్లెపూలు పెడుతున్నట్లుగా ఫోటోను షేర్ చేసింది. దీనికి తోడు 'ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది' అని క్యాప్షన్ పెట్టడంతో త్రిష పెళ్లి చేసుకోబోతుందా? అది ఎంగేజ్మెంట్ ఫోటోనా? అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
హీరోయిన్ త్రిష తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో తన పెంపుడు కుక్క జోరో మృతిచెందినట్లు వెల్లడించింది. గత 12 ఏళ్లుగా తనతో కలిసి ఉన్న జోరో ఈ క్రిస్మస్ ఉదయం చివరి శ్వాస విడిచింది. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుందని పేర్కొంది.
గత ఏడాది 'లియో’ సినిమాలో దళపతి విజయ్‌కు జోడీగా నటించి మంచి విజయాన్ని అందుకున్న త్రిష.. లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి 'విశ్వంభర' మూవీతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో పాటూ తమిళ్, మలయాళ భాషల్లో కలుపుకొని త్రిష చేతిలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి.
దళపతి విజయ్ హీరోగా 'ది గోట్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించిందని దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా వెల్లడించారు. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని కూడా అన్నారు. కాగా విజయ్-త్రిష జంటగా ఐదు చిత్రాల్లో నటించారు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విదాముయార్చి'. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరలవుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నట్లు కొత్త పోస్టర్ ఒకటి చక్కర్లు కొడుతుంది. కానీ దీనిపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవాల్సి ఉంది.
ప్రభాస్ 'స్పిరిట్' మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.
తమిళ స్టార్ అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడాముయర్చి’. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా మూవీ నుంచి త్రిష లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.