BCCI : అదేమీ రూల్ కాదు..: పాక్‌కు బీసీసీఐ కౌంటర్!
దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఆసియాకప్ లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 25 ఏళ్ల అభిషేక్ 13 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు.
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించడంతో పాక్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. స్టేడియం వెలుపల నిరాశ చెందిన పాక్ అభిమానులు తమ జట్టు ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు, బ్యాటింగ్ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం, షేక్ హ్యాండ్ వివాదం తలెత్తింది. విజయం తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్ళు కరచాలనం కోసం ఎదురుచూస్తుండగా, భారత జట్టు వారిని పట్టించుకోకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి తలుపులు మూసుకుంది.
పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పాకిస్థాన్‌పై గెలిచిన అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత సాయుధ బలగాలకు సంఘీభావం తెలిపారు. వారి ధైర్యసాహసాలను ప్రశంసించారు.
పాకిస్తాన్ పై మ్యాచ్ లో విజయం ఎప్పుడూ తమదేనని మరోసారి నిరూపించింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో దాయాదిని చిత్తుగా ఓడించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది.
128 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన టీమ్ ఇండియా 41 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ 23 పరుగులు చేయగా..శుభ్ మన్ గిల్ 10 పరుగులు చేసారు.
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.