Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. T20ల్లోకి ‘కింగ్’ రీఎంట్రీ

2028లో లాస్‌ఏంజిల్స్‌లో జరగనున్న ఒలిపింక్స్‌లో క్రికెట్‌ను చేర్చనున్నారు. అప్పుడు ఒకవేళ టీమిండియా ఫైనల్‌‌కు చేరుకుంటే ఆ ఒక్క మ్యాచ్‌ కోసమైనా తన టీ20 రిటైర్‌మెంట్‌ను వెనక్కు తీసుకుంటానని కోహ్లీ అన్నాడు. ఒలింపిక్స్‌లో పతకం గెలవడం అద్భుతమే కదా అని తెలిపాడు.

New Update
Virat Kohli ruled out a T20 international comeback at the Los Angeles Olympics in 2028

Virat Kohli ruled out a T20 international comeback at the Los Angeles Olympics in 2028

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. తాజాగా ఇన్నేవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో పాల్గొన్న అతడు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే సర్‌ప్రైజ్ అందించాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 128ఏళ్ల తర్వాత 2028లో లాస్‌ఏంజిల్స్‌లో జరగనున్న ఒలిపింక్స్‌లో క్రికెట్‌ను చేర్చనున్నారు. దీంతో ఒకవేళ 2028లో టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకుంటే టీ20ల్లో తన రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకుంటానేమో అని అన్నాడు.

ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

ఆ ఒక్క మ్యాచ్ కోసం రీఎంట్రీ

ఈ మేరకు కోహ్లీ మాట్లాడుతూ.. 2028 ఒలింపిక్స్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంటే.. తాను ఆ ఒక్క మ్యాచ్‌ ఆడేందుకోసమైనా టీ20ల్లో తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటాను అని అన్నారు. ఎందుకంటే ఒలింపిక్స్‌లో పతకం గెలవడం కూడా ఒక అద్భుతమే కదా అని చెప్పాడు. దీంతో కోహ్లీ వ్యాఖ్యలతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు! 

ఇదిలా ఉంటే త్వరలో ఐపీఎల్ 2025 సీజన్ మొదలు కాబోతుంది. దీని కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టుతో కలిశాడు. దీంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. కింగ్ ఇక్కడ ఉన్నాడని.. అందరికన్నా రెండు అడుగులు(కొన్నిసార్లు ఇంకా ఎక్కువ) ముందున్నాడని ఆ పోస్టులో రాసుకొచ్చింది. దీంతో అభిమానులు కోహ్లీని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు