ఆస్ట్రేలియాలో జరుగుతున్న బాక్సింగ్ డే నాలుగో టెస్ట్‌లో విరాట్ చాలా ఏకాగ్రతగా ఆడాడు. ముందు టెస్ట్‌లలో చేసిన తప్పును రిపీట్ చేయకుండా...వికెట్ పోగొట్టుకోకుండా చాలాసేపు ఆడాడు. కోహ్లీ 8 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అయితే మొదట్లో ఆఫ్‌సైడ్ బంతులను వదిలేసి క్రమశిక్షణ పాటించినట్లు కనిపించగా.. చివరకు అదే బంతికి అవుట్ అయి తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. బోలాండ్ వేసిన ఆఫ్ సైడ్ బంతిని కదిలించి వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి కోహ్లీ మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జయస్వాల్ రనౌట్ అవ్వగానే విరాట్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. స్టార్ బ్యాటర్‌ను ఇలా అవమానించడం తగదు.. అవుట్ అయిన తర్వాత పెవిలియన్‌కు వెళుతున్న విరాట్‌ను ఆసీస్ అభిమానులు ఎగతాళి చేశారు. కావాలని అతనిని మాటలతో, చేతలతో రెచ్చగొట్టారు. ఆసీస్ అభిమానుల కామెంట్స్‌తో కోహ్లీకి కోపాన్ని తెప్పించాయి. దీంతో లోపలికి వెళుతున్న అతను వెనక్కి తిరిగి వచ్చి వారిపైపు సీరియస్‌గా చూశాడు. దీన్ని గమనించిన భద్రతా అధికారి కోహ్లీకి నచ్చజెప్పి లోపలికి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసీస్ అభిమానులు, మీడియా ఇలా వరుసపెట్టి విరాట్‌ను అవమానించడం సరికాదంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికి తోడు నిన్న క్రీజ్‌లో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర, కోహ్లీకి మధ్య చిన్న వాగ్వాదం అయింది. దీన్ని కూడా ఆసీస్ అభిమానులు సహించలేకపోతున్నారు. అందుకే కావాలని విరాట్‌ను రెచ్చగొట్టే మాటలు అంటున్నారు. మరోవైపు విరాట్ కోహ్లికి భారతదేశంలో అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. కోహ్లీ పట్ల ఆసీస్ అభిమానులు ప్రవర్తించిన తీరును భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్ ఖండించారు. దేశంలోని అత్యుత్తమ బ్యాటర్ పట్ల ఇంత అమర్యాదకరంగా ప్రవర్తించడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తన ఎక్స్ ఫ్లాట్ ఫామ్‌లో పోస్ట్ పెట్టారు. ఆటగాళ్లపై విమర్శలు చేయొచ్చు కానీ.. అది హద్దులు దాటుతోందని సంజనా అన్నారు. Really disrespectful behavior with country's best batter. Criticism is ok, but abuse crosses the line. Upholding the spirit of cricket and supporting our players with dignity.#ViratKohli𓃵 #INDvsAUS #AUSvIND pic.twitter.com/NnZPDkeOs7 — Sanjana Ganesan 🇮🇳 (@iSanjanaGanesan) December 27, 2024 Virat Kohli almost recreated that incident with a CSK fan at Wankhede 😭😭 pic.twitter.com/35qDBKxuv3 — Pari (@BluntIndianGal) December 27, 2024 ఇక నాలుగో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 164/5 స్కోరుతో ఉంది. రిషభ్ పంత్ 6 పరుగులతో, రవీంద్ర జడేజా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. టీమ్‌ఇండియా ఇంకా 310 పరుగుల వెనకంజలో ఉంది. ఫాలో ఆన్‌ను తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాలి. Also Read: HYD: మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం..డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి