ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉంది ఆస్ట్రేలియా. తప్పనిసరిగా ఎలా అయినా మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిలో టీమ్ ఇండియా ఉంది. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ కోసం ఇరు జట్లూ కొన్ని రోజులుగా హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే టీమ్ ఇండియా ఓవరాల్ పెర్ఫామెన్స్ సరిగ్గా లేకపోవడంతో పరాజయాల బాట పట్టింది. ఇప్పటికి జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా రెండు, భారత్ ఒకటి గెలిచింది. ఒకటి డ్రాగా ముగిసింది. ఈరోజు సడ్నీలో ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో టీమ్ ఇండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కనీసం టెస్ట్ సీరీస్‌ను డ్రా చేయగలుగుతుంది. లేదంటే 3–1 తేడాతో ఆస్ట్రేలియా ట్రోఫీని ఎగురేసుకుని పోతుంది. కెప్టెన్ రోహిత్ అవుట్.. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం సిడ్నీలో ఐడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌కు వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టారు. అతని స్థానంలో బౌలర్ బుమ్రా సారధ్యం వహిస్తున్నాడు. రోహిత్‌కు కనీసం తుది జట్టులో కూడా అవకాశం దక్కలేదు. దీనికి సగం అతను ఆటలో విఫలం అవడం ఒక కారణం అయితే మరో సగం కోచ్ గౌతమ్ గంభీర్, రోహిత్ లకు మధ్య ఉన్న వివాదం మరో కారణం అని తెలుస్తోంది. ఇక చివరి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా నుంచి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. బ్యాటింగ్ కు దిగి ఎంతో సమయం అవలేదు భారత జట్టు అప్పుడే రెండు వికెట్లను కోల్పోయింది. 5 ఓవర్లలో 11 పరుగులు ఉన్న దశలో స్టార్క్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ కొన్‌స్టాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. ఇతను కేవలం నాలుగు పరుగులను మాత్రమే చేశాడు. తరువాత 17 పరుగుల వద్ద జైస్వాల్ కూడా వెస్టర్ చేతికి చిక్కాడు. దీంతో టీమ్ ఇండియా 27 పరుగులకు రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం కోహ్లీ, శుభ్ మన్ గిల్‌లు క్రీజులో ఉన్నారు. Also Read: Amith Shah:కాశ్మీర్ పేరు మార్పు? ఋషి కశ్యప్ పెట్టొచ్చని అన్న అమిత్ షా