మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై టీమిండియా నివాళి ఘటించింది. మెల్‌బోర్న్ వేదికగా నాలుగో (బాక్సింగ్ డే) టెస్టు రెండో రోజున నల్ల బ్యాడ్జీలతో టీమిండియా బరిలోకి దిగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి టీమిండియా ప్లేయర్లు బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆట ఆడుతున్నారు. ALSO READ: నేడు విద్యాసంస్థలకు సెలవు అలాగే మన్మోహన్ సింగ్ మృతిపై భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గుత్తా జ్వాల, వీరేంద్ర సెహ్వాగ్, వినేశ్ ఫోగట్ సంతాపం తెలియజేశారు. నిన్న (డిసెంబర్ 26)న అర్థరాత్రి మన్మోహన్ సింగ్ మరణవార్త బయటకి వచ్చింది. అయితే ఆయన మృతిపై ఇంకా చాలా మంది స్పందించలేదు. బాక్సిండే టెస్టు ఆడుతున్న భారత క్రికెటర్లు సైతం ఇంకా రియాక్ట్ కాకపోవడం విశేషం. ALSO READ: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు! ఇకపోతే మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా ఉన్న సమయంలోనే టీమిండియా వరుస వరల్డ్ కప్‌లు గెలిచింది. మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అలాగే 2011 వన్డే వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఇంకా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సైతం సొంతం చేసుకుంది. ఇవన్నీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే వచ్చాయి. ఇక మన్మోహన్ సింగ్ ఓటమి తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవడానికి దాదాపు 11 ఏళ్లు పట్టింది. ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి... విద్యాసంస్థలకు సెలవు మాజీ ప్రధాని మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే అన్ని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా వారం రోజులపాటు సంతాప దినాలుగా నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులిచ్చారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. ALSO READ: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం 7 రోజుల పాటు సంతాప దినాలు మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు వారి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆయన మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేయనున్నారు.