ICC Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్ ఆశలు గల్లంతు .. సెమీఫైనల్‌కు దక్షిణాఫ్రికా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, భారత్ , ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకోగా..  దక్షిణాఫ్రికా జట్టు కూడా  తాజాగా సెమీఫైనల్స్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్ బెర్త్ ఖరారు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి.

New Update
sa icc

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) లో నాలుగు సెమీ-ఫైనలిస్టులు ఖరారయ్యాయి.  న్యూజిలాండ్, భారత్ , ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకోగా..  దక్షిణాఫ్రికా (South Africa) జట్టు కూడా  తాజాగా సెమీఫైనల్స్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్ బెర్త్ ఖరారు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ పెద్ద విజయం సాధించి ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌కు అవకాశం ఉండేది. కానీ దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లీష్ జట్టు దక్షిణాఫ్రికాపై 207 పరుగుల తేడాతో గెలిస్తేనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకునేది. తద్వారా దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ ఆఫ్ఘనిస్తాన్ కంటే తక్కువగా ఉంటుంది. అయితే, సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు ఎవరితో తలపడుతుంది అనేది రేపు అంటే మార్చి 2న (ఆదివారం) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తర్వాతే తెలుస్తుంది.

Also Read :  పసికందులను విక్రయించే ముఠా అరెస్ట్‌

గ్రూప్- ఎ లో భారత్ , న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి.  ఇందులో న్యూజిలాండ్ జట్టు రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. కివీస్ జట్టు నెట్ రన్ రేట్ 0.863గా ఉంది. మరోవైపు, భారత జట్టు ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో 4 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. భారత్ నెట్ రన్ రేట్ 0.647. అయితే, ఈ రెండు జట్లలో ఏది నంబర్ 1 స్థానంలో ఉంటుందో మార్చి 2న తెలుస్తుంది.  బంగ్లాదేశ్ మూడో స్థానంలో, పాకిస్తాన్ నాల్గవ స్థానంలో నిలిచాయి. ఈ రెండు జట్లకు చెరొక పాయింట్ ఉంది, కానీ బంగ్లాదేశ్ నెట్-రన్ రేట్ మెరుగ్గా ఉండటం వల్ల పట్టికలో పాకిస్తాన్ కంటే ముందుంది. గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా జట్లు  ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో ఉంది, కానీ దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్‌ను ఓడిస్తే మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచింది, రెండు మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ 0.475గా  ఉంది.  

Also Read : పొట్టిగా ఉన్నవారు బరువు తగ్గడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?

ఛాంపియన్స్ ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లు:

మార్చి 2 - న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్
మార్చి 4 - సెమీ-ఫైనల్-1, దుబాయ్
మార్చి 5 - సెమీ-ఫైనల్-2, లాహోర్
మార్చి 9 - ఫైనల్, లాహోర్ (భారతదేశం ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో జరుగుతుంది)
మార్చి 10 - రిజర్వ్ డే

Also Read : తెలుగు రాష్ట్రాల్లో 14 రోజులు బ్యాంకులు బంద్

Also Read :  మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన.. అమిత్‌ షా కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు