కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఆదిత్య జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ బ్రేక్ ముందే కేవలం 72 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో పడింది. ఐడెన్ మార్క్రామ్ (17), వియాన్ ముల్డర్ (5), ట్రిస్టన్ స్టబ్స్ (0) పరుగులకే వెనుదిరిగారు. ర్యాన్ రికెల్టన్ ఒక్కడే ర్యాన్ రికెల్టన్ ఒక్కడే నిలకడగా ఆడుతూ (50 ) పరుగులు చేశాడు. తన కెరీర్ లో ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ అఘా, మహ్మద్ అబ్బాస్, ఖుర్రం షాజాద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాడు సైమ్ అయూబ్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతి చీలమండకు తాకడంతో మైదానం నుండి వెళ్లిపోయాడు. కాగా దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టులో ఆదిత్య జట్టు గెలిచి సిరీస్ లో ముందంజలో ఉంది.