Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి రద్దు..

భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన సంచలన ప్రకటన చేసింది. తన పెళ్లి రద్దయినట్లు తెలిపింది. ఈ మేరకు స్మృతి ఇన్‌స్టా స్టోరీలోలో ఈ విషయాన్ని వెల్లడించింది.

New Update
Smriti Mandhana confirms wedding with Palash Mucchal called off

Smriti Mandhana confirms wedding with Palash Mucchal called off

భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన సంచలన ప్రకటన చేసింది. తన పెళ్లి రద్దయినట్లు(Smriti Mandhana Wedding Cancelled) తెలిపింది. ఈ మేరకు స్మృతి ఇన్‌స్టా స్టోరీలోలో ఈ విషయాన్ని వెల్లడించింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్ ముచ్చల్‌ నవంబర్‌ 23న ఆమె వివాహం జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై స్మృతి క్లారిటీ ఇచ్చింది.   

'' గత కొన్నివారాల నుంచి నా లైఫ్ చుట్టూ ఎన్నో ఊహాగాణాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో నేను మాట్లాడటం ముఖ్యం. నా గురించి అన్నీ సీక్రెట్‌గా ఉండాలని భావించే వ్యక్తిని నేను. కానీ నా పెళ్లి రద్దయిందని అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈ విషయాన్ని మీరు ఇక్కడితో ముగిస్తారని ఆశిస్తున్నాను. రెండు కుటుంబాల మధ్య గోప్యతను గౌరవించి ముందుకు సాగించేందుకు స్పేస్ ఇవ్వాలని కోరుతున్నాను. 

Also Read: తటస్థంగా లేము..శాంతి వైపే ఉన్నాము..ప్రధాని మోదీ

Smriti Mandhana Wedding Cancelled

దేశాన్ని ఉన్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతాను. ఇండియా తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆఢి ట్రోఫీలు తీసుకొస్తా. నాకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఇక ముందుకు సాగాల్సిన సమయం వచ్చేసిందని'' స్మృతి తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. 

పలాశ్‌ ముచ్చల్‌ కూడా తన పెళ్లి రద్దయినట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. '' నా వ్యక్తిగత రిలేషన్ నుంచి బయటకు వచ్చాను. ఆధారాలు లేకుండా వదంతులను సులభంగా నమ్ముతున్న వారిని చూసి తట్టుకోవడం కష్టంగా ఉంది. నా లైఫ్‌లో ఇది అత్యంత కష్టకాలం. సోర్స్ ఎవరో, ఏంటో తెలియని వదంతుల ద్వారా ఎవరినైనా జడ్జి చేసేటప్పుడు ఈ సమాజం గురించి ఆలోచించాలి. ఇలాంటి అంశాల్లో మన మాటలు అవతలి వ్యక్తికి గాయపరుస్తారనే దాన్ని గుర్తించాలి. నా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వాళ్లపై మా లీగల్ టీమ్ చర్యలు తీసుకుంటుందని'' పలాశ్ రాసుకొచ్చారు. 

Also Read :  వన్డే సీరీస్ అయినా దక్కుతుందా? నిర్ణయాత్మక పోరు నేడే..

Advertisment
తాజా కథనాలు