/rtv/media/media_files/2025/02/21/ycoEUR8RP6S71M0muPmu.jpg)
టీమిండియా యంగ్ క్రికెటర్, వన్డే వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా 2025 ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టిన ఈ యంగ్ సెన్సేషన్ అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 8 సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. శుభ్‌మాన్ గిల్ - 51 ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు చేయగా... ఆ తరువాత శిఖర్ ధావన్ - 57 ఇన్నింగ్స్, విరాట్ కోహ్లీ -68 ఇన్నింగ్స్, గౌతమ్ గంభీర్ - 98 ఇన్నింగ్స్, సచిన్ టెండూల్కర్ - 111 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించారు.
Also Read : సచిన్, గంగూలీ అందరూ వెనక్కు..రోహిట్ @ 11000
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్లో ఓపెనర గా వచ్చిన గిల్ 129 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతన్ని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. గిల్కు ఇది బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కావడం విశేషం. కాగా బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి విక్టరీ కొట్టింది. ఫిబ్రవరి 23వ తేదీన దుబాయ్లో పాకిస్థాన్తో తలబడనుంది.
Also Read : అధికారికంగా విడాకులు తీసుకున్న చాహల్-ధనశ్రీ!
Fewest Innings to 8 ODI Hundreds for India
— Vipin Tiwari (@Vipintiwari952) February 20, 2025
- Shubman Gill – 51 innings*
- Shikhar Dhawan – 57 innings
- Virat Kohli – 68 innings
- Gautam Gambhir – 98 innings
- Sachin Tendulkar – 111 innings
pic.twitter.com/XgpS4uA5ne
Also Read : ఛాంపియన్ ట్రోఫిలో భారత్ శుభారంభం.. మొదటి మ్యాచ్‌లోనే విక్టరీ
అజారుద్దీన్ రికార్డు సమం
వన్డేల్లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ప్లేయర్‌గా అజారుద్దీన్(156) పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ లిస్టులో జయవర్ధనే (218), పాంటింగ్ (160) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో అజారుద్దీన్, కోహ్లీ ఉన్నారు. విరాట్ 295 ఇన్నింగ్స్‌లలో, అజారుద్దీన్ 332 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించారు. వన్డేల్లో కేవలం ఐదుగురు భారత ఆటగాళ్లు మాత్రమే 100 క్యాచ్‌లు పట్టారు.
Also Read : బంగ్లా ఆలౌట్.. భారత్ ముందు భారీ లక్ష్యం!