Rohit sharma : రోహిత్ శర్మ ముందు భారీ రికార్డు.. ఒక్క సెంచరీ చేస్తే చాలు!

కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఇవ్వాళ ఆస్ట్రేలియాతో జరిగే చాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క సెంచరీ సాధించగలిగితే అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేయనున్నాడు రోహిత్ శర్మ.

New Update
rohit  (1)

టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఇవ్వాళ ఆస్ట్రేలియాతో జరిగే చాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఒక్క సెంచరీ సాధించగలిగితే అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేయనున్నాడు. దీంతో భారత్  తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు చేసిన మూడవ భారతీయ బ్యాట్స్‌మన్ గా రోహిత్ నిలువనున్నాడు.

Also Read :  రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ  షామా మొహమ్మద్?

ఇప్పటివరకు భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రమే 50 కంటే ఎక్కువ సెంచరీలు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు సాధించగా, విరాట్ కోహ్లీ 82 సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో 49 సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఒక్క సెంచరీ సాధిస్తే ప్రపంచంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అర్ధ సెంచరీలు పూర్తి చేసిన మూడవ బ్యాట్స్‌మన్‌గా అవతరించనున్నాడు.  

Also Read :  నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు దిగజారుడు వ్యాఖ్యలు.. శమాపై బీసీసీఐ సీరియస్ యాక్షన్!

వరల్డ్ వైడ్ గా ఎక్కువ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు!  

అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket) లో అత్యధిక సెంచరీలు

1. సచిన్ టెండూల్కర్ (భారత్) - 100 సెంచరీలు

2. విరాట్ కోహ్లీ  (భారత్) 82 సెంచరీలు

3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 71 సెంచరీలు

4. కుమార్ సంగక్కర (శ్రీలంక) - 63 సెంచరీలు

5. జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) - 62 సెంచరీలు

6. హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) - 55 సెంచరీలు

7. మహేల జయవర్ధనే (శ్రీలంక) - 54 సెంచరీలు

8. జో రూట్ (ఇంగ్లాండ్) - 53 సెంచరీలు

9. బ్రియాన్ లారా (వెస్టిండీస్) - 53 సెంచరీలు

10. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - 49 సెంచరీలు

11. రోహిత్ శర్మ  (భారత్) - 49 సెంచరీలు

Also Read :  ఆసీస్ బ్యాటర్ల వేగానికి భారత స్పిన్నర్లు కళ్ళెం వేస్తారా?

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు

1. సచిన్ టెండూల్కర్  - 100 సెంచరీలు

2. విరాట్ కోహ్లీ 82 సెంచరీలు

3. రోహిత్ శర్మ 49 సెంచరీలు

4. రాహుల్ ద్రవిడ్ 48 సెంచరీలు

5. వీరేంద్ర సెహ్వాగ్ 38 సెంచరీలు

6. సౌరవ్ గంగూలీ38 సెంచరీలు

7. సునీల్ గవాస్కర్  - 35 సెంచరీలు

8. మహ్మద్ అజారుద్దీన్  29 సెంచరీలు

9. శిఖర్ ధావన్  24 సెంచరీలు

10. వీవీఎస్ లక్ష్మణ్ 23 సెంచరీలు

రోహిత్ శర్మ 271 వన్డే మ్యాచ్‌ల్లో 48.74 సగటుతో 11 వేల 64 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు సాధించాడు. 67 టెస్ట్ మ్యాచ్‌ల్లో, రోహిత్ శర్మ 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. టెస్టుల్లో రోహిత్ శర్మ 12 సెంచరీలు, 1 డబుల్ సెంచరీతో సహా 18 అర్ధ సెంచరీలు సాధించాడు.

Also read :  ఆరేళ్ల క్రితం ట్వీట్.. షామా మొహమ్మద్ పై ట్రోల్స్కు దిగిన రోకో ఫ్యాన్స్ !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు