టీమిండియా బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అయితే రిషబ్ పంత్ జీవితంలో డిసెంబర్ 30 ఎప్పటికీ మరిచిపోలేని రోజు. అసలు ఇది చీకటి రోజు అనాలా? లేకపోతే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో గుడ్ డే అనాలో కూడా తెలియదు. రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన కూడా మళ్లీ తిరిగి ఆటను ప్రారంభించాడు. నిజం చెప్పాలంటే రిషబ్ పంత్‌కి పునర్జన్మ లభించిందని చెప్పుకోవచ్చు. "RISHABH PANT – '𝙆𝙤𝙞 𝙅𝙖𝙡𝙙𝙞 𝙉𝙖𝙝𝙞 𝙃𝙖𝙞!' 🫣🔥We are Now Relexd #RishabhPant #INDvsAUS #AUSvINDpic.twitter.com/eS41HlXHrz — FREE HIT (@FREEHIT06) December 30, 2024 ఇది కూడా చూడండి: Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి అసలు ఏమైందంటే? 2022లో డిసెంబర్ 30న రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి రూర్కీలోని తన ఇంటికి వెళ్తున్నాడు. ఇంకో కాసేపట్లో రూర్కీకి చేరుకుంటారనగా.. పంత్ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద ఘటనలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. న్యూ ఇయర్ కారణంగా కుటుంబ సభ్యులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఎవరికి చెప్పకుండా రూర్కీకి బయలు దేరాడు. కారు నడుపుతూ మధ్యలో ఒక్కసారిగా కునుకు తీశాడు. దీంతో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. Rishabh Pant has survived a serious car accident on Delhi-Dehradun highway. He"s been shifted to the hospital in Delhi.He was coming home to surprise his mother and celebrate New Year together #RishabhPantऋषभ पंतhttps://t.co/vENM2FI8Xm — rora chats~ (@rora_chats) December 30, 2022 ఇది కూడా చూడండి: Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే? ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు విండోను పగలగొట్టి స్థానికులు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పంత్ చనిపోవాల్సింది. అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ దాదాపు 14 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తిరిగి మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ఆడటంతో పాటు.. మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం బోర్డ్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఇది కూడా చూడండి: Rohith Sharma: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు ఇది కూడా చూడండి: Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం