/rtv/media/media_files/2025/03/10/MTcjhKAcodgzh6KvryQl.jpg)
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందంటూ వార్తలు రాగా తాజాగా వాటికి జడేజా చెక్ పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన రిటైర్మెంట్ వస్తోన్న వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరాడు. ధన్యవాదాలు అంటూ తన ఇన్ స్టా పోస్టులో వెల్లడించాడు. దీంతో 2027 వరల్డ్ కప్ వరకు జడేజా క్రికెట్ ఆడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. 2009లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా జడేజా క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 203 మ్యాచ్‌ల్లో ఆడిన జడేజా 230 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 8 వేల150 పరుగులు సాధించాడు. టీ20లకు మాత్రం జడేజా రిటైర్మెంట్ ప్రకటించాడు.
Ravindra Jadeja's Instagram story.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2025
- SIR JADEJA IS HERE TO STAY...!!! 🇮🇳 pic.twitter.com/nTQNtNxEKo
ఖండించిన రోహిత్ శర్మ
అటు ఇప్పటికే రిటైర్మెంట్ వార్తలను కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించాడు. భవిష్యత్తు ప్రణాళికల బట్టి నిర్ణయాలు మారవచ్చు. కానీ, ప్రస్తుతానికి అయితే రిటైర్మెంట్ చేయడం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా 4 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. రోహిత్ 76 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ (1) ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశపర్చాడు. శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (34*), శుభ్‌మన్ గిల్ (31), అక్షర్ పటేల్ (29), హార్దిక్ పాండ్య (18), రవీంద్ర జడేజా (9*) పరుగులు చేశారు. మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో ఓవర్ ఉండగానే ఘన విజయం సాధించింది.
Also Read : శ్రీలంక క్రికెటర్ అరెస్ట్ !
Also read : చూసి నేర్చుకోండి.. విదేశాల్లో సంప్రదాయబద్ధంగా.. జడేజా భార్యపై ప్రశంసలు!