సిడ్నీలో జరుగుతున్న భారత్–ఆస్ట్రేలియా చిరి టెస్ట్‌లో రికార్డ్‌లు నమోదవుతున్నాయి. భారత బౌలర్ బుమ్రా ఒకే సీరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. మొదటి ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్, బుమ్రాల వికెట్లను తీసిన పాట్ ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఏడవ ఆస్ట్రేలియన్ క్రికెటర్ గా కమిన్స్ నిలిచాడు. Also Read: Bumrah: ఆట మధ్యలో ఆసుపత్రికి బుమ్రా..కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మెక్‌గ్రాత్ కంటే మెరుగ్గా.. 214 మ్యాచ్‌లు ఆడిన పాట్ కమిన్స్ 24.45 సగటుతో, 3.76 ఎకానమీతో 500 వికెట్లను సాధించాడు. ఈ ఫీట్ సాధించిన ఆస్ట్రేలియన్లలో ఇతని కంటే ముందు షేన్ వార్నర్ (999), మెక్‌గ్రాత్ (948), బ్రెట్ లీ (718), మిచెల్ స్టార్క్ (699), మిచెల్ జాన్సన్ (590) ఇంకా నాథన్ లియోన్ (569)లు ఉన్నారు. కమిన్స్ మెక్‌గ్రాత్ కంటే మెరుగైన స్థానంలో నిలిచాడు. తన మొత్తం కెరీర్‌లో కమ్మిన్స్ 66 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 22.54 సగటుతో 289 వికెట్లు పడగొట్టాడు. అలాగే వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున 90 సార్లు ఆడిన కమిన్స్ 28.78 సగటుతో 143 స్కాల్ప్‌లను కలిగి ఉన్నాడు. ఇక టీ20ల విషయానికి వస్తే కమ్మిన్స్ 57 మ్యాచ్‌లలో 23.57 సగటుతో 19.0 స్ట్రైక్ రేట్‌తో 66 వికెట్లు పడగొట్టాడు. Also Read: BIG BREAKING: రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ సంచలన ప్రకటన ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ సీరీస్‌లో పాట్ కమిన్స్ మొత్తం ఇప్పటివరకు 22 వికెట్లు తీశాడు. బుమ్రా తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్ గా నిలిచాడు. బుమ్రా 32 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉన్నాడు. మరోవైపు కమిన్స్ కెప్టెన్‌గా కూడా తన సత్తా చాటుకుంటున్నాడు. ఆస్ట్రేలియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. Also Read: Hyderabad: ఇక మీదట ఐదు రోజుల్లోనే పాస్ట్ పోర్ట్ Also Read: USA: ప్రమాణ స్వీకారానికి ముందు హష్ మనీ కేసు విచారణకు ట్రంప్