IND vs PAK : టీమిండియాతో మ్యాచ్..  పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్

టీమిండియాతో ఫిబ్రవరి 23న జరగనున్న మ్యాచ్ కు ముందు  పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది.  గాయం కారణంగా ఆ జట్టు కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ దూరమైనట్లుగా పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ఫఖర్ ఫిల్డింగ్ చేస్తుండగా గాయపడ్దాడు.

New Update
Fakhar Zaman

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో ఫిబ్రవరి 23న  జరగనున్న మ్యాచ్ కు ముందు  పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.  గాయం కారణంగా ఆ జట్టు కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ దూరమైనట్లుగా పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు వెల్లడించింది.  బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ ఫిల్డింగ్ చేస్తుండగా గాయపడ్దాడు. జమాన్ స్థానంలో సౌద్ షకీల్ ఓపెనర్‌గా వచ్చాడు. దీంతో గాయం తీవ్రమైంది అని  తెలియడంతోఅతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.  దీంతో ఫఖర్ జమాన్ దుబాయ్ కు వెళ్లడం లేదు. అతని స్థానంలో ఇమామ్ ఉల్ హక్ ను తీసుకునే అవకాశం ఉంది.  

 

60 పరుగుల తేడాతో భారీ ఓటమి

మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలోని పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది.  ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున టామ్ లాథమ్ 104 బంతుల్లో అత్యధికంగా 118 పరుగులు చేశాడు. ఓపెనర్ విల్ యంగ్ 113 బంతుల్లో 107 పరుగులు చేశాడు.  న్యూజిలాండ్ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్తాన్ తరఫున ఖుస్దిల్ షా 49 బంతుల్లో అత్యధికంగా 69 పరుగులు చేశాడు. బాబర్ ఆజం 90 బంతుల్లో 64 పరుగులు చేశాడు.

Also Read :   DELHI BJP : బీజేపీ పెద్ద స్కెచ్.. ఏపీలో రఘురామ.. ఢిల్లీలో విజేందర్ గుప్తా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు