/rtv/media/media_files/2025/02/27/pzs0yt0JqucudYuMH61e.jpg)
పాకిస్తాన్ క్రికెట్ చెత్త రికార్డును సృష్టించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన మొదటి ఆతిథ్య దేశంగా అవతరించింది. మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని జట్టు తన తొలి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడగా అందులో 60 పరుగుల తేడాతో ఓటమని చవిచూసింది. ఇక రెండో మ్యాచ్ భారత్ తో ఆడగా.. అందులో టీమిండియా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక మూడో మ్యాచ్ బంగ్లాదేశ్ పైన గెలిచి పరువు కాపాడుకుందాం అంటే పాపం వరుణుడు వారికి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు.
దీంతో గ్రూపు ఏ లో చివరి స్థానాన్ని దక్కించుకుని పాక్ ఇంటిముఖం పట్టింది. పాకిస్తాన్ టోర్నమెంట్‌ను -1.087 నికర రన్ రేట్‌తో 1 పాయింట్‌తో నిరాశతో ముగించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన దేశం టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చినప్పటికీ కెన్యా కూడా ఒక్క మ్యాచ్ గెలవలేకపోయింది, కానీ ఆ సమయంలో కెన్యా జట్టు ప్లేఆఫ్ దశలో ఆడింది. 2002కు ముందు ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా పిలువబడిన ఈ టోర్నీని ఆ తరువాత ఛాంపియన్స్ ట్రోఫీగా మార్చారు. 23ఏళ్ల చరిత్ర ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్యమిస్తూ ఒక్క విజయం కూడా లేకుండా ముగించడం ఏ జట్టుకైనా ఇదే తొలిసారి.
పాకిస్తాన్‌కు ప్రైజ్ మనీ ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయినప్పటికీ ఖాళీ చేతులతో మాత్రం వెళ్లదు. పాకిస్తాన్‌కు ఐసీసీ నుండి దాదాపు రూ. 2 కోట్ల 37 లక్షల ప్రైజ్ మనీ రానుంది. ఈ టోర్నీలో ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లకు 1.40 లక్షల డాలర్లు అంటే దాదాపు 1 కోటి 22 లక్షల రూపాయలు ఇవ్వనుంది. అంతేకాకుండా హోస్టింగ్ చేసినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి మరింత డబ్బు అందుకోనుంది.
Also read : Pak vs Ban :బంగ్లాదేశ్తో మ్యాచ్ రద్దు.. పరువు తీసుకున్న పాకిస్థాన్ !
Also read : Kedar దగ్గర సినీ పెద్దల బ్లాక్ మనీ.. ఆ వేల కోట్లు ఎక్కడ.. వారందరిలో హైటెన్షన్!