పాకిస్థాన్లో హై అలెర్ట్ :  ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. రంగంలోకి ఉగ్రవాదులు!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనడానికి పాకిస్థాన్కు వచ్చిన విదేశీయులను లక్ష్యంగా చేసుకోవడానికి ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) ప్లాన్ చేసిందని పాకిస్థాన్ నిఘా సంస్థ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో (PIB) హెచ్చరిక జారీ చేసింది.  

New Update
icc pakistan

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రస్తుతం పాకిస్థాన్లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీలో జరిగే మ్యాచ్ లను చూసేందుకు పెద్ద సంఖ్యలో విదేశీయులు అక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడా విదేశీయుల భద్రత గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మ్యాచ్ లను చూసేందుకు వచ్చిన విదేశీయులను లక్ష్యంగా చేసుకోవడానికి ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) ప్లాన్ చేసిందని పాకిస్థాన్ నిఘా సంస్థ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో (PIB) హెచ్చరిక జారీ చేసింది.  

చైనా, అరబ్ దేశాల పౌరులను లక్ష్యంగా

విదేశీయులను కిడ్నాప్ చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని  ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందని ఇంటెలిజెన్స్ బ్యూరో తెలిపింది. ముఖ్యంగా చైనా, అరబ్ దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకోవాలని ISKP యోచిస్తోంది. ఈ దేశాల నుండి సందర్శకులు తరచుగా ఉపయోగించే ఓడరేవులు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలలో నిఘా నిర్వహిస్తుందని ఇంటెలిజెన్స్ బ్యూరో  చెబుతోంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన విదేశీయుల భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాద సంస్థ ISKP నగర శివార్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేయని, రిక్షా, మోటార్ సైకిల్ ద్వారా మాత్రమే చేరుకోవడానికి అవకాశం ఉన్న ఇళ్లను అద్దెకు తీసుకోవాలని ప్లా్న్ చేసినట్లుగా సమాచారం.  

విదేశీయులను కిడ్నాప్ చేసి, వారిని రాత్రిపూట అద్దె ఇళ్లకు తరలించడమే వ్యూహంగా పెట్టుకుందని తెలుస్తోంది. తద్వారా ఎవరికీ ఆ విషయం తెలియకుండా ఉంటుందని యోచిస్తోంది.  పాకిస్థాన్ హెచ్చరిక మధ్య, ఆఫ్ఘనిస్తాన్ జనరల్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (GDI) కూడా ISKP ఆఫ్ఘనిస్తాన్‌లోని కీలక ప్రదేశాలపై దాడి చేయవచ్చని హెచ్చరిక జారీ చేశారు. ఆఫ్ఘన్ ఏజెన్సీ బహిరంగ ప్రదేశాలలో నిఘా పెంచాలని ఆదేశించారు.  2024లో షాంగ్లాలో చైనా ఇంజనీర్లపై దాడి, 2009లో లాహోర్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన దాడి వంటి సంఘటనలు పాక్ భద్రతా సంసిద్ధతపై సందేహాలను లేవనెత్తాయి.

ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైంది.  ఫిబ్రవరి 23న భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన పాక్ అంతకుముందు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 

Also Read :  రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్‌ !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు