BAN vs NZ : బంగ్లాకు చావో రేవో.. న్యూజిలాండ్‌ టార్గెట్ 237

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.  ఆ జట్టు ఆటగాళ్లలో కెప్టెన్ శాంటో (77), జాకీర్ ఆలీ (45), రిషాద్‌ హొస్సేన్‌ (26)పరుగులతో రాణించారు.

New Update
ban vs nz

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.  ముందుగా టాస్ గెలిచి న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్  బౌలింగ్  ఎంచుకోవడంతో బంగ్లా బ్యాటింగ్ చేపట్టింది.  బంగ్లాదేశ్ తరపున, నజ్ముల్ హొస్సేన్ శాంటో 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా జాకీర్ ఆలీ (45), రిషాద్‌ హొస్సేన్‌ (26)పరుగులతో రాణించారు. తంజిద్‌ హసన్ (24), మోహదీ హసన్ మిరాజ్ (13) టస్కిన్‌ అహ్మద్‌ (10) తక్కువ పరుగులకే ఔట్ కాగా తౌహిద్ (7), ముష్ఫికర్ రహీమ్ (2), మహ్మదుల్లా (4) సింగిల్‌ డిజిట్‌ స్కోరు మాత్రమే చేశారు.  

న్యూజిలాండ్ గెలిస్తే

న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్  బ్రేస్‌వెల్‌ 4 వికెట్లు తీయగా, విలియం ఓ రూర్క్‌ 2, కైల్‌ జేమీసన్‌, మ్యాట్‌ హెన్రీ చెరో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్ బంగ్లాకు చావో రేవో. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే  బంగ్లాకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక న్యూజిలాండ్ గెలిస్తే భారత్ తో పాటుగా సెమీస్ వైపు ముందంజలో ఉంటుంది.  పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ సెమీస్ రేసు నుంచి వైదోలుగుతాయి. 

న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్ , రాచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓ'రూర్కే

బంగ్లాదేశ్ జట్టు : నజ్ముల్ హుస్సేన్ శాంటో (సి), తాంజిద్ హసన్, మెహిది హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికె), మహ్మదుల్లా రియాద్, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నహిద్ రానా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు