BCCI:నితీశ్ రెడ్డికి పేరెంట్స్ సర్‌‌ప్రైజ్..వీడియో షేర్ చేసిన బీసీసీఐ

బాక్సింగ్ డే టెస్ట్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి సెంచరీ చేశాడు. ఈ అద్భుత సెంచురీకి బీసీసీఐ అతనికి పెద్ద సర్‌‌ప్రైజ్ ఇచ్చింది. అతని తల్లిదండ్రులను ఆస్ట్రేలియా తీసుకువచ్చి నితీశ్‌ను సంతోషంలో మునిగిపోయేలా చేసింది.

New Update
parents

Nithish parents surprise

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతోన్న నాలుగో (బాక్సింగ్ డే) టెస్ట్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తనదైన శైలిలో అదరగొట్టాడు. ఈ టెస్టులో టీమిండియా జట్టును ఫాలో ఆన్‌ నుంచి తప్పించి ఆపద్భాంధవుడయ్యాడు. అనంతరం అంతర్జాతయ టెస్టుల్లో తొలి సెంచరీని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. తను ఆడుతున్న మొదటి టెస్ట్‌లోనే సెంచరీ సాధించి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి నిలిచాడు.

ఎమోషనల్ వీడియో..

దీంతో నితీశ్ మీద సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అందరూ అతనికి రివార్డులు కూడా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా నితీశ్ కి ఒ సర్‌‌ప్రైజ్ ఇచ్చింది. మూడో రోజు ఆట ముగిసిన హోటల్‌ రూమ్‌ కు వెళ్ళ సమయానికి అతని తల్లిదండ్రులను అక్కడికి పంపించింది. సడెన్‌గా పేరెంట్స్‌ను చూసిన నితీశ్ భావోద్వేగానికి గురయ్యాడు. వెంటనే వారిని హగ్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా ఎమోషనల్ అయిపోయారు. వీరందరితో పాటూ రితీశ్ సోదరి కూడా అక్కడే ఉంది. 

నితీశ్.. తన తల్లిని కౌగిలించుకుని.. ఆట ఎంజాయ్ చేశావా.. అని అడిగాడు. ఆ తర్వాత తన తండ్రిని కూడా అతను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ సమయంలో నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి.. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుకున్నారు. ఈరోజు నితీశ్‌ చాలా బాగా ఆడాడు. ఒక తండ్రిగా చాలా గ‌ర్వంగా ఉంది. చిన్న‌ప్ప‌టి నుంచి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. భారత జట్టు త‌ర‌పున సత్తా చాటాలనే అతడి కళ ఈరోజు నెరవేరింది. ఇదే సమయంలో మాట్లాడిన నితీశ్ సోదరి తేజస్వీ.. నా అన్న చెప్పాడు.. చేసి చూపించాడు.. అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ త‌న అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్‌ చేసింది.

Also Read: Bengaluru: కండోమ్స్‌ సేల్స్‌లో బెంగళూరు టాప్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు