/rtv/media/media_files/2026/03/16/naveen-2026-03-16-12-53-47.jpg)
అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ రంగంలో భారతీయుడు నవీన్ పులిగిల్ల అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కెన్యా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ర్యాలీ రేసుల్లో ఆయన రెండు కీలక విజయాలను అందుకున్నాడు. నవీన్ పులిగిల్ల ఒకే ఈవెంట్‌లో రెండు వేర్వేరు ఛాంపియన్‌షిప్‌ల కింద రేసును పూర్తి చేసి పోడియం ఫినిష్ సాధించడం విశేషం. ప్రపంచ ర్యాలీ ఛాంపియన్‌షిప్ విభాగంలో నవీన్ 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే సమయంలో జరిగిన ఆఫ్రికన్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో మరింత జోరు ప్రదర్శించి రన్నరప్ దక్కించుకున్నారు.
నవీన్‌కు కార్లంటే ప్రాణం
వయసు పెరుగుతున్న కొద్దీ నవీన్‌కు కార్లంటే ప్రాణం అయిపోయింది. ఎలాగైనా రేసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే ముందుగా కార్లు, బైక్‌ల గురించి తెలుసుకోవడానికి మెకానిక్ పనులు కూడా నేర్చుకున్నాడు. పాత కార్లను కొత్తగా మార్చడం, కారు బరువు తగ్గించడానికి అందులో మార్పులు చేయడం వంటివి చేస్తూ గడిపేవాడు. ఇలా చదువు సంధ్యలు వదిలేసి కార్ల వెంట పడుతున్నాడని ఇంట్లో వారు కంగారు పడి, బలవంతంగా పై చదువుల కోసం యూకే పంపించారు. అక్కడ ఎంబీఏలో చేరినా, నవీన్ మనసంతా ఎప్పుడు కార్ల పైనే ఉండేది. దాంతో చదువును మధ్యలోనే వదిలేసి, ఒక ఆటోమొబైల్ కంపెనీలో చేరి రేసింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు.
యూకే నుండి తిరిగి వచ్చాక, 2012లో తన భార్య సహకారంతో ఆర్కిటెక్ట్‌గా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టారు నవీన్. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించి సెటిల్ అయ్యాక, తన పాత కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇష్టమే ఆయన్ని చెన్నైలో జరిగిన ఫోక్స్ వ్యాగన్ పోలో కప్ పోటీల వరకు తీసుకెళ్లింది. అక్కడ మొదలైన ఆయన ప్రస్థానం.. నేడు కెన్యాలో జరిగిన అంతర్జాతీయ రేసులో పతకాలు సాధించే స్థాయికి చేరింది.
Follow Us