/rtv/media/media_files/2026/03/29/ms-dhoni-2026-03-29-17-58-16.jpg)
MS Dhoni out of IPL 2026 till end of April
చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు మరో బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ MS ధోనికి గాయం కావడంతో అతను మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ముందుగా ధోని కేవలం రెండు వారాల పాటు మాత్రమే రెస్ట్ తీసుకుంటారని ఫ్రాంచైజీ ప్రకటించింది. కానీ తాజా రిపోర్టుల ప్రకారం అతని కాలి కండరాల గాయం (Calf Strain) తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ధోనీ కోలుకునేందుకు ఏప్రిల్ చివరి వారం వరకు సమయం పట్టొచ్చని సమాచారం. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ ధోనీ.. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు.
Also Read: జైలులో మొబైల్ ఫోన్లు, టీవీ వాడుతున్న ఖైదీలు.. సిబ్బందిపై వేటు
ధోని ఏప్రిల్ నెలాఖరువరకు రాకపోతే ఆరు కీలక మ్యాచ్‌లు మిస్సయ్యే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అతను టీమ్‌లోకి వస్తాడా లేదా అనేది సందేహాంగానే ఉంది. గత కొన్ని సీజన్లుగా చూసుకుంటే ధోనీ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను తగ్గించుకుంటూ వస్తున్నారు. మైదానంలో అతని వ్యూహాలు సీఎస్‌కేకు కొండంత అండగా ఉండేవి. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో.. రాజస్థాన్ రాయల్స్‌తో గౌహతిలో జరగనున్న మొదటి మ్యాచ్ నుంచే CSK తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
CSKకు సవాళ్లు
అయితే ధోనీ లేకపోవడం వల్ల జట్టు బాధ్యతను యువ సారథి అయిన రుతురాజ్ గైక్వాడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అతనికి కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో పాటు సీనియర్ ఆటగాళ్ల సపోర్ట్ ఉండనుంది. మరోవైపు వికెట్ కీపింగ్ బాధ్యతలను సంజూ శామ్సన్ చేపట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ లోయర్ ఆర్డర్‌లో ధోనీ ఫినిషర్ పాత్రలోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2026లో CSK మొదటి మ్యాచ్‌నే తమ ఐకాన్ ప్లేయర్ లేకుండా బరిలోకి దిగడం అనేది సవాలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
#CrickIt | MS Dhoni’s injury absence may extend well beyond Chennai Super Kings’ original estimate, with a Times of India report saying the veteran is now unlikely to return before the last week of April after suffering a calf strain in training. That marks a significant shift… pic.twitter.com/7726pRMcM6
— Hindustan Times (@htTweets) March 29, 2026
Also Read: ఎమ్మెల్యేలకు ఐపీఎల్ టిక్కెట్లు: డీకే శివకుమార్ కీలక అప్‌డేట్!
Follow Us