/rtv/media/media_files/2025/03/08/ssr1g2b153bz5l9SMPFT.jpg)
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఇక దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలిచి న్యూజిలాండ్ ఫైనల్ లో చోటు సంపాదించింది. దీంతో ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మార్చి 9 (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
న్యూజిలాండ్ కు బిగ్ షాక్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ కు టెన్షన్ పెరిగింది. ఎందుకంటే ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ ఫైనల్‌లో ఆడటం సందేహంగా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ టైమ్ లో హెన్రీ భుజానికి గాయం అయింది. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ పడుతుండగా హెన్రీ భుజానికి గాయమైంది. న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టీడ్ మీడియాతో మాట్లాడుతూ ఫైనల్‌కు 48 గంటల ముందు వరకు మాట్ హెన్రీ ఫిట్‌నెస్ గురించి ఖచ్చితంగా చెప్పలేమనే అన్నాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మాట్ హెన్రీ 16.70 సగటుతో పది వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా ఉన్నాడు. దుబాయ్‌లో భారత్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో కూడా హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి పరిస్థితిలో హెన్రీ ఆడకపోతే భారత జట్టుకు అది శుభవార్తే అని చెప్పుకోవచ్చు.
ఒకవేళ మాట్ హెన్రీ ఆడలేకపోతే ఫాస్ట్ బౌలర్ జాకబ్‌కు జట్టులో చోటు లభించవచ్చు. ప్రస్తుత టోర్నమెంట్‌లో డఫీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో డఫీ ఒక మ్యాచ్ ఆడాడు. అందులో 48 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు.
జట్ల అంచనా
న్యూజిలాండ్ : మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్.
Also Read : కోమా నుంచి లేచొచ్చి పేషెంట్ హల్ చల్.. డాక్టర్లకు చుక్కలు చూపించాడు!