బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. సిడ్నీ వేదికగా ఐదో (చివరి) టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అతి తక్కువ పరుగులే చేసింద. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 72.2 ఓవర్లలో కేవలం 185 పరుగులకే ఆలౌట్ అయింది. 1 వికెట్ నష్టానికి 9 పరుగులు Also Read: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్సర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్ అనంతరం ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ మొదటి నుంచే తడబడుతుంది. భారత బౌలర్లు ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు. తన మార్క్ బౌలింగ్‌తో చెలరేగిపోతున్నాడు. అయితే తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌ను నమోదు చేసింది. 1 వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. బుమ్రా vs కొన్‌స్టాస్ ఇది కూడా చదవండి: కుప్ప కూలిన మరో విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి సీరియస్ మరో బాల్ వేస్తే ఇవాళ ఆట ముగుస్తుందన్న సమయంలో బుమ్రాకి ఆసీస్ బ్యాటర్ కొన్‌స్టాస్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. బుమ్రా బౌలింగ్ వేస్తున్న సమయంలో స్ట్రైక్‌లో ఉన్న ఉస్మాన్ ఖవాజా మధ్యలో ఆగాడు. దీంతో ఏమైందంటూ బుమ్రా ప్రశ్నించాడు. ఆ సమయంలోనే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కొన్‌స్టాస్ సమాధానమిచ్చాడు. దీంతో "నువ్ ఎందుకు మాట్లాడుతున్నావ్" అంటూ ప్రశ్నించాడు బుమ్రా. KL Rahul once said "You go after one of us, all 11 will come right back"Thats true all 11 went over him after thatwicket 😭😭This Konstas Kid first messed with Kohli, and now he"s going after BumrahSomeone should tell him he"s challenging his owners pic.twitter.com/pbx3OKjyZW — 𝘿 (@DilipVK18) January 3, 2025 Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్? ఇక కొన్‌స్టాస్ కూడా వెనక్కి తగ్గకుండా నోటికి పనిచెప్పాడు. దీంతో బుమ్రా, కొన్‌స్టాస్ మధ్య గొడవ పెద్దదైంది. ఇక అంపైర్లు కలుగజేసుకుని గొడవని సర్దుమనిగించారు. గొడవ అనంతరం అదే ఓవర్ చివరి బాల్ బుమ్రా వేయగా.. స్ట్రైక్‌లో ఉన్న ఖవాజా ఔటయ్యాడు. స్లిప్‌కు క్యాచ్ ఇచ్చాడు. దెబ్బకి భారత ఆటగాళ్లలో ఆ ఆక్రోశం చూడాలి ఓ రేంజ్‌లో ఉంది. స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టగానే బుమ్రా ఫైర్ మామూలుగా లేదు. వెంటనే కొన్‌స్టాస్ వైపు చూశాడు. విరాట్ ఫైర్ ఇది కూడా చదవండి: తెలంగాణ మంత్రుల వేలకోట్ల కుంభకోణం.. నా దగ్గర ప్రూఫ్స్: ఏలేటి సంచలనం Inject.🔥🥶Konstas surely got scared at non-striker end bc.😭🤣#INDvsAUS pic.twitter.com/i3tl5V5BHp — Utkarsh (@toxify_x18) January 3, 2025 ఇక అదే సమయంలో విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా. సరదా సరదాకే చిర్రెత్తిపోతాడు. ఇలాంటి టైంలో కోహ్లీని ఆపడం ఎవరితరం కాదు. ఇలా క్యాచ్ పట్టాడో లేదో.. అలా అరుపులతో గోల గోల చేశాడు. దీంతో సిడ్నీ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.