Bumrah: ఆట మధ్యలో ఆసుపత్రికి బుమ్రా..కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ

సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియా–టీమ్ ఇండియా చివరి టెస్ట్ మ్యాచ్ రెండవరోజు ఆట మధ్యలోనే కెప్టెన్ బుమ్రా మైదానం నుంచి తప్పుకున్నాడు. అతను ఆడలేకపోతుండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. బుమ్రా స్థానంలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

author-image
By Manogna alamuru
New Update
bumrah1

bumrah1

సిడ్నీలో జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో ఆసీస్, భారత్‌లు చివరి టెస్ట్ ఆడుతున్నారు. రెండవ రోజు ఆటలో భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బుమ్రాను ఆట మధ్యలోస్కానింగ్ కోసం, ఇతర వైద్యం కోసం ఆసుత్రికి తరలించారు. బుమ్రా ప్లేస్లో విరాట్ కోహ్లీ ప్రస్తుతానికికెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.  బుమ్రా స్టేడియం నుంచి కారులో ఆసుపత్రికి వెళ్ళినట్లు తెలుస్తోంది. 

 

Also Read: BIG BREAKING: రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ సంచలన ప్రకటన

Also Read :  ఇన్‌స్టా ప్రేమ.. దాడిలో కార్లు ధ్వంసం

ఆడలేకపోయిన బుమ్రా..

బుమ్రా ఈరోజు లంచ్ తర్వాత ముందు ఆడలేక మైదానాన్ని విడిచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్ళాడు. అయితే మళ్ళీ కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. కానీ అతను అప్పుడు కూడా ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. దాంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది.  బుమ్రా తొడకండరాలు పట్టేసాయా లేదా గాయం అయిందా అనేది మాత్రం తెలియలేదు. ఒకవేళ బుమ్రా ఆడకపోతే మాత్రం టీమ్ ఇండియాకు చేదు వార్తే అవుతుంది. ప్రధాన బౌలర్ లేకుండా పోతాడు. చివరి టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిన భారత్‌కు ఇది చాలా గట్టి దెబ్బే అవుతుంది. ప్రస్తుతానికి ఇతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డ్ అభిమన్యు ఈశ్వరన్ వచ్చాడు.  

ఇక లంచ్ బ్రేక్ తర్వాత కూడా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా కొంతసేపటి క్రితమే తొమ్మిదో వికెట్ కోల్పోయింది. వెబ్‌స్టర్ ఇచ్చిన క్యాచ్‌ను యశస్వి అద్భుతంగా అందుకున్నాడు. దీంతో ప్రసిధ్‌కు మూడో వికెట్ లభించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 166 పరుగులు. లైయ్, బోలాండ్‌లు క్రీజులో ఉన్నారు.  

Also Read: Hyderabad: ఇక మీదట ఐదు రోజుల్లోనే పాస్ట్ పోర్ట్

Also Read: USA: ప్రమాణ స్వీకారానికి ముందు హష్ మనీ కేసు విచారణకు ట్రంప్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు