Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. బూమ్రాకు తీవ్రగాయం.. IPL నుంచి ఔట్..!

ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీని కోసం యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 28 నుంచి మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఫస్ట్ మ్యాచ్ RCB VS SRH మధ్య ఉండబోతుంది.

New Update
Jasprit Bumrah reached BCCI Coe before ipl 2026

Jasprit Bumrah reached BCCI Coe before ipl 2026

ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీని కోసం యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 28 నుంచి మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఫస్ట్ మ్యాచ్ RCB VS SRH మధ్య ఉండబోతుంది. ఇక పలు జట్లకు సంబంధించిన ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్‌ను గ్రౌండ్‌లో చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ అభిమానులకు ఊహించన షాక్ తగిలింది. 

Jasprit Bumrah

ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు గాయం అయినట్లు తెలుస్తోంది. తాజాగా అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)ని సందర్శించనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిది తీవ్ర చర్చకు దారితీసింది. 

బుమ్రా ప్రస్తుతం కర్ణాటక (బెంగళూరు) కేంద్రంలో ఉన్నట్లు సమాచారం. అతడు ఇంకా తన జట్టుతో ప్రాక్టీస్‌లో చేరలేదని టాక్ నడుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం.. బుమ్రా గాయం కారణంగా అక్కడికి వెళ్ళాడా లేక సాధారణ వైద్య పరీక్షల కోసమా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఒకవేళ నిజంగానే బుమ్రాకు గాయం అయితే ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడనే టాక్ నడుస్తోంది. 

కాగా ఇటీవల ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే మాట్లాడుతూ.. ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లకు కొంత విశ్రాంతి ఇచ్చామని తెలిపారు. "ప్రతి సంవత్సరం ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం. ప్రపంచ కప్‌లో ఆడిన ఆటగాళ్లకు అదనపు విరామం ఇచ్చాము. తద్వారా వారు ఉత్సాహంగా తిరిగి రాగలరు. తొలి మ్యాచ్‌కు ముందు విదేశీ ఆటగాళ్లు, భారత స్టార్లు ఇద్దరూ సుమారు వారం రోజుల పాటు జట్టుతో కలిసి తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తారు" అని జయవర్ధనే అన్నారు. ముంబై ఇండియన్స్ తమ ఐపీఎల్ 2026 ప్రచారాన్ని మార్చి 29న ప్రారంభించనుంది. వారి తొలి మ్యాచ్ ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరగనుంది.

Advertisment
తాజా కథనాలు