SRH Captain Ishan Kishan: ఇట్స్ అఫీషియల్: SRH కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. వైస్ కెప్టెన్‌గా ఎవరంటే?

ఐపీఎల్ 2026కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయాన్ని జట్టు ఇవాళ (మార్చి 18) అధికారికంగా ప్రకటించింది.

New Update
SRH Captain Ishan Kishan

SRH Captain Ishan Kishan:

ఐపీఎల్ 2026కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయాన్ని జట్టు ఇవాళ (మార్చి 18) అధికారికంగా ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ నడుము కింది భాగంలో గాయం కారణంగా టోర్నమెంట్‌లోని మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. 

SRH Captain Ishan Kishan

ఇటీవల జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ లభించింది. అతను 193 స్ట్రైక్ రేట్‌తో 317 పరుగులు చేసి జట్టు పవర్‌ప్లేలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో దూకుడుగా ఆడే ఓపెనర్ అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించింది. 

ఇదిలా ఉంటే ఇషాన్ కిషన్ అతి తక్కువ సమయంలోనే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అతడు 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు కూడా అదే జట్టులో కొనసాగుతున్నాడు.

ఇది అతడికి రెండవ సీజన్ మాత్రమే. అయినప్పటికీ ఫ్రాంచైజీ ఇషాన్‌కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అయితే అందుకూ ఓ కారణం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల దేశీయ టీ20 టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కిషన్ సారథ్యంలోని జార్ఖండ్ జట్టు విజయం సాధించింది. కెప్టెన్‌గా అతనికి ఈ విజయమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 

2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో కిషన్ హర్యానాపై అద్భుతమైన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 49 బంతుల్లోనే సెంచరీ సాధించి తన జట్టుకు 69 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. 

Advertisment
తాజా కథనాలు